Thank You Movie ట్విట్టర్ రివ్యూ..

ABN , First Publish Date - 2022-07-22T14:34:14+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ ఏడాది లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా సక్సెస్ లు అందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జూలై 22) థాంక్యూ (Thank You)

Thank You Movie ట్విట్టర్ రివ్యూ..

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ ఏడాది లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా సక్సెస్ లు అందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జూలై 22) థాంక్యూ (Thank You) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాశీ ఖన్నా (Rashi Khanna) హీరోయిన్‌గా మాళవిక నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మనం  ఫేమ్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించగా, అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. అయితే, విడుదలకి కొన్ని గంటల ముందే ఏపీలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అలాగే, యూఎస్‌లోనూ మూవీ రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో అభిమానులు, నెటిజన్స్ తమ రివ్యూలను ఇస్తున్నారు. మరి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే ఒక లుక్కేయాల్సిందే..


థాంక్యూ సినిమాలో చైతన్య నటన అద్భుతంగా ఉంది. క్లాస్ అయినా మాస్ అయినా బాగా చేస్తాడు. చైతన్య పెర్ఫార్మెన్, విక్రమ్ కుమార్ టేకింగ్, పోకిరి కటౌట్ ట్విస్ట్, వైజాగ్ ఎపిసోడ్, థమన్ బీజీఎమ్ సహా జనాన్ని ఆకట్టుకున్నాయి. రన్ టైం సినిమాకు ప్లస్.. అని ఒక నెటిజన్ తన రివ్యూని చెప్పాడు. 


చైతన్య యాక్టింగ్ బాగుంది. అవికా గోర్ కి నటనలో ప్రాధాన్యత దక్కింది.. ఈ సినిమా ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్ అని మరికొందరు అంటున్నారు. 


మరో నెటిజన్ మూవీ ఓవరాల్‌గా చాలా బావుంది. సాంగ్స్ చాలా డీసెంట్‌గా ఉన్నాయి..అని కామెంట్ పెట్టారు. మొత్తంగా థాంక్యూ సినిమా టాక్ చూస్తుంటే చైతూ మరో హిట్ కొట్టాడు. అని అనుకోవచ్చు. మరి పూర్తిగా రివ్యూలు బయటకు వస్తే కానీ సినిమా ఎలా ఉందనేది తెలుస్తుంది. 



Updated Date - 2022-07-22T14:34:14+05:30 IST