యువసామ్రాట్ (YuvaSamrat) నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (ThankYou). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్లో దిల్ రాజు (Dil Raju)- శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన రాశీ ఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ ఆసక్తికర వీడియోతో పాటు.. టీజర్‌ని ఎప్పుడు విడుదల చేయబోతుందీ అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.
అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family)కి ‘మనం’ (Manam) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన విక్రమ్ కె. కుమార్.. ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోతో చేస్తున్న ఈ ‘థ్యాంక్యూ’ చిత్ర టీజర్‌ని.. మే 25న సాయంత్రం 5గంటల 04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అంతకుముందు నాగచైతన్య డబ్బింగ్ చెబుతున్న వీడియోని యూనిట్ పోస్ట్ చేయగా.. అందులో ‘నిజంగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేస్తున్నారా?’ అంటూ దర్శకుడిని చైతూ ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ తర్వాత మరింతగా ఈ సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం అనేలా చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా, లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram) ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి (BVS Ravi) కథను అందించగా.. నవీన్ నూలి (Naveen Nooli) ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.