సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ (Bangaraju)చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు అక్కినేని నాగచైతన్య(Naga chaitanya). ఏడాది ప్రారంభంలో మంచి వసూళ్లతో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు వేసవి కానుకగా ‘థ్యాంక్యూ’(thank you) చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విక్రమ్ కె కుమార్ (Vikram k kumar )దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 8న (Thank you movie on 8 july)సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన డేట్ పోస్టర్‌ను నాగచైతన్య ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ‘మా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘థ్యాంక్యూ’ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయడానికి అందరూ సిద్దంగా ఉండండి’’ అని నాగచైతన్య ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చైతూకి జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. మాళవికా నాయర్ (Malavika nair), అవికాగోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. ఈ చిత్రం తర్వాత చై.. పరుశురామ్‌తో సినిమా చేయనున్నట్లు ఇటీవల తెలిపారు.