Jawan: షారుఖ్‌ఖాన్ సినిమాలో అతిథి పాత్రలో విజయ్ దళపతి?.. ఆ వైరల్ పిక్స్ నిజమేనా..

ABN , First Publish Date - 2022-08-25T16:14:08+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మొట్టమొదటి సారి సౌత్ ఇండియన్ డైరెక్టర్‌ అట్లీతో కలసి పని చేస్తున్నాడు...

Jawan: షారుఖ్‌ఖాన్ సినిమాలో అతిథి పాత్రలో విజయ్ దళపతి?.. ఆ వైరల్ పిక్స్ నిజమేనా..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) మొట్టమొదటి సారి సౌత్ ఇండియన్ డైరెక్టర్‌ అట్లీతో కలసి పని చేస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమా పేరు ‘జవాన్(Jawan)’. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. గత కొన్నినెలల క్రితం విడుదలైన ఈ సినిమాలోని షారుఖ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటికి వస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇంతకుముందే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాతో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు న్యూస్ వచ్చింది. తాజాగా సైతం మరో క్రేజీ వార్త ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు న్యూస్ ప్రచారం అవుతుంది. ఈ తరుణంలో షారుఖ్ ఖాన్, విజయ్ దళపతి కలిసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది జవాన్ సెట్ అంటూ చర్చించుకుంటున్నారు. ఈ పిక్ చూసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో.. ‘వావ్.. జవాన్‌లో దళపతి విజయ్ నటిస్తున్నాడు’ అంటూ ఒకరు.. ‘ఇకపై విజయ్ దళపతి కాదు.. క్యామియో స్టార్ అవుతాడు’ అంటూ మరొకరు రాసుకొచ్చారు.


షారూఖ్ ఖాన్, దళపతి విజయ్‌ని కలిసి ఒకేసారి వెండితెరపై చూడటం చాలా బాగుంటుంది. అయితే వైరల్ అయిన ఆ చిత్రం నకిలీది. నిజానికి గతంలో బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో షారుఖ్ పాల్గొన్నాడు. అక్కడ తీసిన చిత్రాన్ని తీసుకుని.. దానికి విజయ్ పిక్‌ని యాడ్ చేసి నెట్‌‌లో వదిలారు. దాంతో అది నిజమే అనుకుని విజయ్ ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేశారు.









Updated Date - 2022-08-25T16:14:08+05:30 IST