అక్కడ విజయ్ ‘బీస్ట్’పై బ్యాన్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-05T17:59:13+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. ఈ నటుడి కొత్త సినిమా వస్తుందంటే..

అక్కడ విజయ్ ‘బీస్ట్’పై బ్యాన్.. కారణం ఏంటంటే..

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. ఈ నటుడి కొత్త సినిమా వస్తుందంటే కోలీవుడ్ మాదిరిగానే టాలీవుడ్‌లోని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ‘వరుణ్ డాక్టర్’ సినిమాతో వినూత్న డైరెక్టర్‌గా పేరుపొందిన నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


మూవీ టీం ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవలే విడుదల చేసింది. ఈ సినిమా టెర్రరిజం ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఇందులో విజయ్ ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. దీంతో కువైట్‌లో ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించారు. దీనికి సంబంధించి ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ‘కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్ మూవీని బ్యాన్ చేసింది. దానికి కారణం.. సినిమాలో పాకిస్తాన్ గురించి, టెర్రరిస్ట్‌లను, వయెలెన్స్‌ని చూపించడం కావొచ్చు. గతంలో కురుప్, ఎఫ్‌ఐఆర్ వంటి భారతీయ సినిమాలపై సైతం కువైట్‌లో నిషేధం విధించారు. ఇలాంటి విషయాల్లో కువైట్ సెన్సార్ చాలా ఖచ్చితంగా వ్యవహారిస్తోంది’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-04-05T17:59:13+05:30 IST