రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆ సినిమాలో నటించనున్న Thalapathy Vijay..?

ABN , First Publish Date - 2022-07-11T01:56:24+05:30 IST

సినీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్స్ అతిథి పాత్రలో కనిపించడం కొత్తేమీ కాదు. సినిమాను మలుపు తిప్పే పాత్రలో కొద్ది నిమిషాల పాటు కనిపిస్తారు. స్టార్స్ నటిస్తే సినిమాకు కూడా క్రేజ్ వస్తుంది. ఈ మధ్యనే

రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆ సినిమాలో నటించనున్న Thalapathy Vijay..?

సినీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్స్ అతిథి పాత్రలో కనిపించడం కొత్తేమీ కాదు. సినిమాను మలుపు తిప్పే పాత్రలో కొద్ది నిమిషాల పాటు కనిపిస్తారు. స్టార్స్ నటిస్తే మూవీకి కూడా క్రేజ్ వస్తుంది. ఈ మధ్యనే సూర్య(Suriya) ‘విక్రమ్’ (Vikram)లో అతిథి పాత్రలో మెరిశాడు. ఆ పాత్ర కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. మాధవన్ నటించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ లోను సూర్య గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించాడు. తాజాగా మరో కోలీవుడ్ సూపర్ స్టార్ అతిథి పాత్ర‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పారితోషికం తీసుకోవడం లేదని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న చిత్రం ‘జవాన్’ (Jawan). నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోనే దళపతి విజయ్ (Thalapathy Vijay) అతిథి పాత్రలో కనిపించనున్నాడని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ‘జవాన్’ కోసం సమయం కూడా కేటాయించాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో 25రోజుల పాటు చెన్నైలో జరపనున్నారు. ఆ సమయంలోనే విజయ్‌పై సీన్స్‌ను షూట్ చేయనున్నారట. ఈ చిత్రంలో నటించడానికే విజయ్ పారితోషికం తీసుకోవడం లేదని తెలుస్తోంది. షారూఖ్ ఖాన్, అట్లీతో ఉన్న సాన్నిహిత్యంతోనే ఈ మూవీలో నటించడానికి విజయ్ అంగీకరించినట్టు సమాచారం. ‘జవాన్’ ను పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని 2023 జూన్ 2న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.


Updated Date - 2022-07-11T01:56:24+05:30 IST