Vijay 66: 2023 సంక్రాంతి బరిలో విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం

ABN , First Publish Date - 2022-05-10T23:20:16+05:30 IST

దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా.. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (SVC), పీవీపీ సినిమా (PVP Cinema) బ్యానర్లపై.. నిర్మాతలు దిల్ రాజు

Vijay 66: 2023 సంక్రాంతి బరిలో విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం

దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా.. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (SVC), పీవీపీ సినిమా (PVP Cinema) బ్యానర్లపై.. నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish), పరమ్ వి పొట్లూరి (Param V Potluri), పెరల్ వి పొట్లూరి (Pearl V Potluri) సంయుక్తంగా భారీ స్థాయిలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‪గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‪డేట్‪ని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‪డేట్‪లో.. ఈ చిత్రంలో నటించే తారాగణంతో పాటు, విడుదల విషయంలోనూ మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు.  


విజయ్ 66వ (Vijay66) చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‪లో భారీ తారాగణం కనువిందు చేయనుందని తెలుపుతూ.. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్ (Sarath Kumar), ప్రభు (Prabhu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రీకాంత్ (Srikanth), జయసుధ (Jayasudha) వంటి వారితో పాటు శామ్ (Shaam), యోగిబాబు (Yogibabu), సంగీత (Sangeetha), సంయుక్త (Samyuktha) ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి(Pongal 2023) కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోని.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడనే వార్త వచ్చినప్పుడే.. ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మాములుగా ఏర్పడలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ అవుతున్న తారాగణం చూస్తుంటే.. ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి.


మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భారీ తారాగణమే కాకుండా.. అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా వర్క్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్‪ప్లేను అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్‪గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‪కి శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా.. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.















Updated Date - 2022-05-10T23:20:16+05:30 IST