ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి Thalapathi Vijay

ABN , First Publish Date - 2022-07-07T19:37:18+05:30 IST

కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న హీరో దళపతి విజయ్. తమిళనాట విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన విజయ్.. బాక్సాఫీస్ వద్ద రూ. 200కోట్లు పైచిలుకు వసూళ్ళు తెచ్చిపెట్టగల సామర్ద్యం కలిగిన హీరో. ఫ్లాప్ సినిమా అయినప్పటికీ.. అత్యధిక ఓపెనింగ్స్ కొల్లగొట్టగల కెపాసిటీ అతడి సొంతం.

ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి  Thalapathi Vijay

కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న హీరో దళపతి విజయ్. తమిళనాట విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన విజయ్.. బాక్సాఫీస్ వద్ద రూ. 200కోట్లు పైచిలుకు వసూళ్ళు తెచ్చిపెట్టగల సామర్ద్యం కలిగిన హీరో. ఫ్లాప్ సినిమా అయినప్పటికీ.. అత్యధిక ఓపెనింగ్స్ కొల్లగొట్టగల కెపాసిటీ అతడి సొంతం. కొంతకాలంగా అతడి సినిమాలు తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని సినిమాలు మాత్రమే ఎక్కువ వసూళ్ళను కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలుగు మార్కెట్ ను కూడా హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఇప్పుడు ‘వారసుడు’ అనే ద్విభాషా చిత్రంతో రాబోతున్నాడు. 


ఇదిలా ఉంటే.. విజయ్‌కు ఇప్పటి వరకూ సోషల్ మీడియా అకౌంట్ లేదు. కోలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు ట్విట్టర్ , ఇన్ స్టా లాంటి అకౌంట్స్ ఉన్నాయి. తమ సినిమాలకు సంబంధించిన అప్టేట్స్‌ను అభిమానులకు అందిస్తూ.. వారందరూ సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఈ క్రమంలో త్వరలో విజయ్ కూడా ఇన్ స్టా ఖాతా తెరవబోతున్నాడు. @actorvijay అనే పేరుతో ఇన్ స్టా ఖాతాను తెరవబోతున్నాడు. ప్రస్తుతం ఈ అకౌంట్ ఎలాంటి పోస్టుల్లేకుండా.. ప్రైవేట్ మోడ్ లో ఉంది. దాంతో విజయ్ ఎప్పుడు ఇన్ స్టా ఖాతాలో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. విజయ్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా మొట్టమొదట ఎలాంటి పోస్ట్ పెడతాడా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. 


విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంతో పాటు.. తమిళంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. ఇంకా పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. గత చిత్రం బీస్ట్ తో అంతగా మెప్పించలేకపోయిన విజయ్.. తదుపరి చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఇన్ స్టా అకౌంట్ బాగా యూజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి విజయ్ ఎప్పుడు తన ఇన్ స్టా అకౌంట్ తో అభిమానులతో టచ్ లోకి వస్తాడో చూడాలి. 

Updated Date - 2022-07-07T19:37:18+05:30 IST