Thaggede Le Film Review: అడల్ట్ జోక్స్, హింసాత్మకం ఈ 'తగ్గేదే లే'

ABN , First Publish Date - 2022-11-05T23:17:17+05:30 IST

దర్శకుడు శ్రీనివాస రాజు గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే అతను తీసిన 'దండుపాళ్యం' సినిమా, అటు కన్నడం లో ఇటు తెలుగులో సంచలన విజయం సాధించింది. అదే దర్శకుడు ఇప్పుడు నవీన్ చంద్ర కథానాయకుడుగా 'తగ్గేదే లే' (Thaggede Le) అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Thaggede Le Film Review: అడల్ట్ జోక్స్, హింసాత్మకం ఈ 'తగ్గేదే లే'

సినిమా: తగ్గేదే లే 

నటీనటులు: నవీన్ చంద్ర, రవిశంకర్, అయ్యప్ప శర్మ, రాజా రవీంద్ర, దివ్యా పిళ్లై, అనన్యా సేన్ గుప్తా, మ‌క‌రంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే తదితరులు 

సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్ 

బ్యాక్ గ్రౌండ్ సంగీతం: చిన్నా

సంగీతం: చ‌ర‌ణ్ అర్జున్‌

నిర్మాతలు: ప్రేమ్ కుమార్ పాండే, ఎన్‌ అఖిలేష్ రెడ్డి, పి వి సుబ్బా రెడ్డి

దర్శకత్వం:  శ్రీనివాస రాజు 


 -- సురేష్ కవిరాయని 


దర్శకుడు శ్రీనివాస రాజు గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే అతను తీసిన 'దండుపాళ్యం' సినిమా, అటు కన్నడం లో ఇటు తెలుగులో సంచలన విజయం సాధించింది. (Director Srinivasa Raju is popular with the film 'Dandupalyam' and its sequels) అదే దర్శకుడు ఇప్పుడు నవీన్ చంద్ర కథానాయకుడుగా 'తగ్గేదే లే' (Thaggede Le) అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Dialogue king Sai Kumar brothers Ravi Shankar and Ayyappa Sharma) తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప శర్మ ఇద్దరూ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. దివ్య పిళ్ళై, (Divya Pillai and Ananya Sen Gupta are the female leads) అనన్య సేన్ గుప్త కథానాయికలుగా నటించారు. 'తగ్గేదే లే' అన్న పదం 'పుష్ప' సినిమాతో పాపులర్ అవటం ఆ పదాన్నే, ఈ సినిమాకి టైటిల్ పెట్టడం వలన ఈ సినిమా మీద కొంచెం ఆసక్తి కలిగింది.


#ThaggedeLeStory కథ: 

ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లప్ప (రవి శంకర్) డ్రగ్ మాఫియా ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక టిప్ వస్తుంది, ఒక ట్రక్ నిండా డ్రగ్స్ రవాణా అవుతున్నాయని, అందుకోసం అతను సమాచారం కోసం ఒక ధాబా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈశ్వర్ (నవీన్ చంద్ర) ఇంట్లో ఒక అమ్మాయి హత్య జరిగింది, ఇంకో పోలీస్ ఆఫీసర్ (రాజా రవీంద్ర) ఈశ్వర్ ని తీసుకొని అదే ధాబా దగ్గరికి తీసుకు వస్తాడు. ఇంకో పక్క దండుపాళ్యం గ్యాంగ్ ని కోర్ట్ కి తీసుకెళ్లే క్రమం లో ఆ గ్యాంగ్ తప్పించుకొని ఆఫీసర్ చెల్లప్ప మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. డ్రగ్ మాఫియా లీడర్ (అయ్యప్ప శర్మ) తన ముఠాలో కొంతమంది ఇన్ఫార్మర్స్  వున్నారని భావిస్తూనే  ఒక ట్రక్ తో డ్రగ్స్ ని పంపిస్తాడు. ఆ ట్రక్ మాయం అయిందని అతను తన గ్యాంగ్ తో బయలుదేరతాడు. ఈలోపు పోలీస్ ఆఫీసర్ ఈశ్వర్ ని అతని ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పమంటాడు. ఇలా అందరూ చివరికి దాబా దగ్గరికి చేరుకుంటూ వుంటారు. ఈశ్వర్ ఇంటిలో జరిగిన హత్యకి, దండుపాళ్యం గ్యాంగ్ కి, డ్రగ్స్ రవాణా చేస్తున్న మాఫియా లీడర్ కి, ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏమిటి సంబంధం, చివరి కథ ఎటువంటి మలుపులు తిరిగింది అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. 


విశ్లేషణ:

దర్శకుడు శ్రీనివాస రాజు 'దండుపాళ్యం' సినిమా దానికి సీక్వెల్స్ తీసి మంచి పేరు సంపాదించాడు. అందుకని ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉండొచ్చు అని ఆసక్తి కలగడం సహజం. సినిమా మొదలవడం కూడా చాలా ఆసక్తికరంగా మొదలయింది. రవి శంకర్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్ఫార్మర్ ని కలవటం, డ్రగ్ రాకెట్ ని పట్టుకుంటాను అనటం అవన్నీ బాగున్నాయి. తరువాత నవీన్ చంద్ర ఇంట్లో హత్య, అతని ఫ్లాష్ బ్యాక్ తో కథ గాడి తప్పింది. చాలా కథ అడల్ట్ జోక్స్ తో మరీ చీప్ గా నేరేట్ చెయ్యడం, అలాగే సన్నివేశాలు బోరింగ్ గా ఉండటం సినిమా మెయిన్ కథ నుంచి పక్కకి తప్పుకుంది. మధ్య మధ్యలో పోలీస్ ఆఫీసర్ తన ఇన్ఫార్మర్ తో డ్రగ్ రాకెట్ ని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగడం, అలాగే దండుపాళ్యం గ్యాంగ్ తప్పించుకోవటానికి ప్రయత్నాలు చెయ్యటం.ఇవన్నీ కొంచెం ఆసక్తిగా కనపడినా, చివర్లో ఆ పోరాట సన్నివేశం, మరీ ఘోరంగా, హింసాత్మకంగా ఎక్కువ సేపు సాగింది. దర్శకుడు ఏదో కొత్తగా చూపిస్తాడు అనుకున్న వాళ్ళకి కొంచెం నిరాశే మిగులుతుంది. కథ నార్మల్ గా ఉండటం ముందు ముందు ఏమి జరగబోయేది ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉండటం వలన ఇందులో అంత సస్పెన్స్ ఏమి లేదు. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు తప్ప మొత్తం సినిమాలో విషయం ఏమి లేదు.  బావ మరదల మధ్య సన్నివేశాలు కూడా మామూలుగా వున్నాయి. సినిమాలో భావేద్వేగాలు చాల మిస్ అయ్యాయి. దర్శకుడు కథ మీద దృష్టి పెట్టి ఈ సినిమాని ఒక యాక్షన్ సినిమాగా తీయవచ్చు కానీ, కొంచెం చీప్ గా తీసేసాడు అనిపిస్తుంది. 'దండుపాళ్యం' లాంటి సినిమా  తీసిన శ్రీనివాస రాజు ఏంటి చాలా చీప్ గా సినిమా ముగించేశాడు అనిపిస్తుంది. అలాగే సినిమా చాల లౌడ్ గా ఉంటే, దానికి తోడు సాయి కుమార్ ఇద్దరి తమ్ముళ్ల గొంతు మామూలుగా మాట్లాడితేనే లౌడ్ స్పీకర్ లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మరి అలంటి వాళ్ళు అరిస్తే, బాబోయ్ తట్టుకోలేము. 


నటీనటుల విషయానికి వస్తే నవీన్ చంద్ర పరవాలేదు అనిపించాడు. గెట్ అప్ శీను, ఆటో రామ్ ప్రసాద్ లు నవీన్ చంద్ర స్నేహితులుగా అడల్ట్ జోక్స్ వేసుకుంటూ కనపడతారు, కానీ నవ్వించలేకపోయారు. అది వాళ్ళ తప్పు కాదు, రచయితలది. అలాగే ఇద్దరు కథానాయికలు దివ్య పిళ్ళై, అనన్య సేన్ గుప్త మామూలుగా చేసారు. అంతే. రవి శంకర్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. అలాగే అయ్యప్ప శర్మ కూడా బాగా చేసాడు. రాజా రవీంద్ర కూడా పోలీస్ ఆఫీసర్ గా బాగా సెట్ అయ్యాడు. నైనా గంగూలీ ఒక పాటలో గ్లామర్ గా కనపడుతుంది. దండుపాళ్యం గ్యాంగ్ సభ్యుల్లో మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె వెరైటీ గా చేసారు. 30 ఏళ్ల పృథ్వి డాక్టర్ సమరం రోల్ లో కనిపిస్తాడు. కథ సరిగ్గా లేనప్పుడు నటీనటులు కొంతమంది బాగా చేసినా అది కనపడదు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం లౌడ్ గా ఉంటుంది, పాటలు మామూలుగా వున్నాయి. కథ, కథనం లో కొత్తదనం లేక చివరి యాక్షన్ సన్నివేశం కోసం సినిమా తీశారు అనిపిస్తుంది. ఆ యాక్షన్ సన్నివేశం కూడా చాల భయానకంగా తీశారు, చూడలేము స్క్రీన్ మీద. సెన్సార్ వాళ్ళు ఈ సన్నివేశాన్ని ఎలా ఆమోదించారో అర్థం కాలేదు. 

చివరగా 'తగ్గేదే లే' సినిమా చాల నిరాశ కలిగిస్తుంది. 'దండుపాళ్యం' తీసిన శ్రీనివాస రాజు, ఆ కోవలో ఒక యాక్షన్ సన్నివేశం మాత్రమే తీసాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే, ఈ సినిమాలో విషయం అంతగా లేదు. 

Updated Date - 2022-11-05T23:17:17+05:30 IST