సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాం: వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై TFPC

ABN , First Publish Date - 2022-01-10T23:20:21+05:30 IST

టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమను అవమానించినట్లుగా భావిస్తున్నామని తెలుపుతూ

సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాం: వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై TFPC

టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమను అవమానించినట్లుగా భావిస్తున్నామని తెలుపుతూ.. వెంటనే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ విషయం తెలియజేస్తూ అధికారికంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.


ఇందులో.. ‘‘కోవూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి.. ‘మన సినిమా నిర్మాతలను బలిసినవాళ్లు’ అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజనిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాము. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది, చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారనే సంగతి తేటతెల్లమవుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డిగారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ.. వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము..’’ అని పేర్కొన్నారు.  



Updated Date - 2022-01-10T23:20:21+05:30 IST