Pawan kalyan- TFJA: 175 మందితో.. 700మందికి ఆసరా!

ABN , First Publish Date - 2022-09-10T22:02:45+05:30 IST

తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు.

Pawan kalyan- TFJA: 175 మందితో.. 700మందికి ఆసరా!

తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (TFJA)వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) ఆవిష్కరించారు. అసోసియేషన్‌ కోసం కృషి చేస్తున్న ప్రెసిడెంట్‌ లక్ష్మి నారాయణ, జనరల్‌ సెక్రెటరీ వై. జె. రాంబాబు ట్రెజరర్‌ నాయుడు సురేంద్రకుమార్‌ ఇతర సభ్యులను ఆయన అభినందించారు.


‘‘175 మంది సభ్యులున్న  తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి ఉండే  యూట్యూబ్‌ ఛానల్‌ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్‌లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కల్పించడం, జీవిత భీమా కింద 15లక్షలు, యాక్సిడెంట్‌ పాలసీ కింద రూ.25 లక్షలు ఇవ్వడం వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 175 మంది జర్నలిస్టులపై ఆధారపడ్డ వారిని కలిపి దాదాపు 700 మందికి అవసరమొచ్చినప్పుడు ఆసరా లభిస్తుంది. అలాగే ఆదర్శవంతమైన జర్నలిజం, సమాజంలోని తప్పొప్పులను సరి చేేసలాగా, అవసరం లేని వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్‌ అవుతుందని కోరుకుంటున్నాను’’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 




Updated Date - 2022-09-10T22:02:45+05:30 IST