TFWPJA: అనిల్ రావిపూడి బర్త్‌డే.. ఫొటో జర్నలిస్ట్స్ ప్రత్యేక విశెష్

ABN , First Publish Date - 2022-11-24T03:39:21+05:30 IST

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3’ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా గుర్తింపు పొందారు దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi). అపజయమెరుగని దర్శకుడిగా

TFWPJA: అనిల్ రావిపూడి బర్త్‌డే.. ఫొటో జర్నలిస్ట్స్ ప్రత్యేక విశెష్

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3’ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా గుర్తింపు పొందారు దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi). అపజయమెరుగని దర్శకుడిగా విజయవంతంగా దూసుకెళుతున్న అనిల్ రావిపూడి తదుపరి చిత్రం నందమూరి నటసింహం బాలయ్యతో అనే విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. నవంబర్ 23 అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెందరో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  


అనిల్ రావిపూడి (Anil Ravipudi) పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (TFWPJA) సభ్యులు ప్రత్యేకంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ రావిపూడితో కేక్ కట్ చేయించి.. పుష్పగుచ్చం అందజేశారు. తన పుట్టినరోజున తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు చూపించిన ప్రేమకు అనిల్ రావిపూడి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే గుర్తింపు వస్తుందని, ఫొటో జర్నలిస్ట్‌లు ప్రతి రోజూ ఎంత కష్టపడతారో తనకి తెలుసని అన్నారు. ఈ అసోసియేషన్‌కు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా తెలియజేశారు. 

Updated Date - 2022-11-24T03:39:21+05:30 IST