Tollywood: ఇప్పుడు ఇండస్ట్రీకి ‘అఖండ’ కావాలి

ABN , First Publish Date - 2022-08-03T03:01:08+05:30 IST

తెలుగు సినిమా ముందెన్నడూ లేనంత క్రైసిస్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో సినిమాల చిత్రీకరణే ఆపేసే పరిస్థితి వచ్చింది. రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు కోట్లలో నష్టం మిగుల్చుతున్నాయి. ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి

Tollywood: ఇప్పుడు ఇండస్ట్రీకి ‘అఖండ’ కావాలి

తెలుగు సినిమా ముందెన్నడూ లేనంత క్రైసిస్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో సినిమాల చిత్రీకరణే ఆపేసే పరిస్థితి వచ్చింది. రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు కోట్లలో నష్టం మిగుల్చుతున్నాయి. ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి రావడం మానేశారు. నిజానికి ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే సినిమాలు కూడా విడుదల కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ మార్కెట్ మళ్ళీ రివైవ్ కావాలి అంటే ఒక ‘క్రాక్’ (Krack) మూవీ కావాలి, ఒక ‘అఖండ’ (Akhanda) కావాలి. కరోనా తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారో రారో అనే డౌట్‌లో అందరూ ఉంటే, రవితేజ (Ravi Teja) డేర్ చేసి ‘క్రాక్’ సినిమాని రిలీజ్ చేశాడు. మాస్ బొమ్మ పడాలే కానీ ఆడియన్స్ థియేటర్స్‌కి నడుచుకుంటూ కాదు ఏకంగా పరిగెత్తుకుంటూ వస్తారు అని ప్రూవ్ చేసింది ‘క్రాక్’. ఈ మూవీ రవితేజకి మాత్రమే కంబ్యాక్ హిట్ కాదు, మొత్తం ఇండస్ట్రీకే ఇది కంబ్యాక్ హిట్. 


దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే రిలీజ్ అయిన మూవీ ‘అఖండ’. బాలయ్య - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలిస్తే ఆ మూవీ సూపర్ హిట్ అనే విషయం అందరికీ తెలుసు కానీ... టికెట్ రేట్స్ పూర్తిగా నామమాత్రంగా ఉన్న సమయంలో, APలో థియేటర్స్ బంద్ అయ్యే పరిస్థితుల్లో.. కరెంట్ బిల్స్ కూడా రావేమో అని అందరూ భయపడుతున్న సీజన్‌లో.. బ్రేక్ ఈవెన్ కూడా కాదేమోనని ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమాని విడుదల చేయడానికే ఆలోచిస్తున్న సందర్భంలో... ఇండస్ట్రీకే ధైర్యాన్ని ఇస్తూ బాలయ్య, అఖండ సినిమాని రిలీజ్ చేశాడు. ఈ మూవీ చూడడానికి బి, సి సెంటర్స్ ఆడియన్స్ రిపీట్ మోడ్‌లో థియేటర్‌కి వచ్చారు. థియేటర్స్‌లో ‘జై బాలయ్య’ నినాదం మోతమోగింది.. ప్రేక్షకులతో థియేటర్ కళకళలాడింది. 


‘అఖండ’ సినిమాతో బాలయ్య (Balayya) ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు.. ‘క్రాక్’ మూవీ టైంలో టికెట్ రేట్స్ ఎక్కువే ఉన్నాయి కానీ.. పాన్ ఇండియా సినిమాలు కూడా కష్టపడుతున్న టైంలో, ఎక్కువ టికెట్ రేట్స్ కోసం ఇండస్ట్రీ అంతా ప్రభుత్వాల చుట్టూ తిరిగే టైంలో... ఐ డోంట్ కేర్ అన్నట్లు బాలయ్య ‘అఖండ’ని రిలీజ్ చేసి, కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు.. టికెట్ రేట్స్ తక్కువ ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌కి మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా చూస్తారు అని నిరూపించాడు బాలయ్య. ఇప్పుడు ఇండస్ట్రీకి ఇలాంటి ఒక సినిమానే కావాలి, అంత డేర్ ఉన్న హీరో కావాలి. ఇప్పుడున్న టైంలో బాలయ్య NBK107 రిలీజ్ అయ్యి ఉంటే ట్రేడ్ వర్గాలు చాలా రిలాక్స్ అయ్యే వారు. ఏదో ఒక సినిమా ‘అఖండ’ మ్యాజిక్‌ని రిపీట్ చేసి, థియేటర్స్‌లో సినిమాని బ్రతికిస్తే బాగుండని నేడు ఇండస్ట్రీ (Tollywood) మొత్తం కోరుకుంటోంది.

Updated Date - 2022-08-03T03:01:08+05:30 IST