Tollywood wants dark: టాలీవుడ్ హీరోస్ కి నలుపే కావాలిట

Twitter IconWatsapp IconFacebook Icon
Tollywood wants dark:  టాలీవుడ్ హీరోస్ కి  నలుపే కావాలిట

ఇదేదో కొత్తగా వుంది కదూ వినటానికి. కానీ ఇది నిజం. ఇప్పుడు మన టాలీవుడ్ కథానాయకులు (Tollywood heroes) చాలామంది నలుపునే (Dark colour) కావాలని కోరుకుంటున్నారు. ఏమిటీ నలుపు అని అనుకుంటున్నారా! ఏమి లేదు ఇదంతా మొదట మొదలయ్యింది యష్ (Actor Yash) నుండి, అతను కె జి ఎఫ్ (KGF Film) సినిమా పార్ట్ వన్ నుంచి. ఆ సినిమా సబ్జెక్టు గనులు (Gold mines) బ్యాక్ డ్రాప్ (Backdrop) తో వచ్చింది, అందుకని యష్ గ్లామర్ ని వదిలేసి కొంచెం నల్లగా (de-glamourised) కనపడతాడు కదా అందులో.

Tollywood wants dark:  టాలీవుడ్ హీరోస్ కి  నలుపే కావాలిట

అదే విధంగా మన స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ (Style Icon Allu Arjun) కూడా అస్సలు స్టైల్ గా లేకుండా, గ్లామర్ లేకుండా (de-glamourised) వున్న పాత్ర చేసిన సినిమా 'పుష్ప' (Pushpa). ఇందులో అల్లు అర్జున్ నల్లగా కనపడటానికి ప్రత్యేకంగా మేకప్ (special make-up) వేయించుకున్న సంగతి తెలిసిందే. అది వెయ్యడానికి చాలా టైం కూడా పట్టేది అతను ఎన్నో సార్లు చెప్పాడు. 

Tollywood wants dark:  టాలీవుడ్ హీరోస్ కి  నలుపే కావాలిట

ఇప్పుడు అల్లు అర్జున్, పుష్ప పార్ట్ 2 లో కూడా అదే పాత్రని కంటిన్యూ చేస్తాడు. అది కూడా మొదటి పార్ట్ లో లా మొత్తం డి గ్లామరైజ్డ్ రోల్ కదా మరి. ఇంకో నటుడు కూడా ఈ నలుపునే ఎంచుకున్నాడు ఇప్పుడు. అతనెవరో కాదు, నాని (Actor Nani). ఇతను దసరా (Dasara film) అనే సినిమా చేస్తున్నాడు, అది కొన్ని వారాల్లో విడుదల అవుతుంది కూడాను. ఇందులో నానీ బొగ్గును (Coal backdrop) దొంగతనం చేసే ముఠా లో ఉంటాడు అని తెలిసింది. అందులో నాని ఎలా ఉంటాడో విడుదల అయినా పోస్టర్స్ చూస్తేనే మనకే అర్థం అయిపోతోంది కదా. 

Tollywood wants dark:  టాలీవుడ్ హీరోస్ కి  నలుపే కావాలిట

ఇదిలా ఉంటే, టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) లో కూడా రవితేజ (Ravi Teja) కొంచెం నల్లగానే కనపడాలని చూస్తున్నాడట. అందులో కొన్ని పోరాట సన్నివేశాలు (Action sequences) ఇలాంటి నలుపు బ్యాక్ డ్రాప్ లో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదీ కాకుండా ఆ సినిమా పీరియడ్ డ్రామా. అంటే 40వ దశకం లోనో, 50వ దశకం లోనో జరిగిన కథ. ఇంకా అతను కూడా నలుపే కావాలని అంటున్నాడని అంటున్నారు. 

Tollywood wants dark:  టాలీవుడ్ హీరోస్ కి  నలుపే కావాలిట

ఇంకో యంగ్ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కూడా నలుపే ముద్దు అంటున్నాడట. అతను ఏజెంట్ (Agent) సినిమా షూట్ మళ్ళీ మొదలయింది. దసరా తరువాత మలయాళం సూపర్ స్టార్ (Malayalam Superstar Mammootty) మమ్మూట్టి వస్తున్నాడట. 15 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తారని తెలిసింది. అయితే ఆ సినిమా క్లైమాక్స్ మాత్రం నలుపులోనే చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు,  హీరో అఖిల్ అనుకుంటున్నట్టు భోగట్టా.  ఒకవేళ అది కంఫర్మ్ అయితే, అఖిల్ కూడా ఏదైనా బొగ్గు గానో, లేదా ఇంకో మైన్ బ్యాక్ డ్రాప్ లో ఆ పోరాట సన్నివేశం చిత్రీకరించాం వచ్చు. బళ్లారి కి దగ్గరలో ఇలాంటివి చాల వున్నాయి. అక్కడ అయితే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నట్టు తెలిసింది. 

దీన్ని బట్టి ఇప్పుడు టాలీవుడ్ లో చాలామంది నటులు ఈ నలుపంటేనే ముద్దు అంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములా (Formula) ని ఫాలో అవటం మొదటి నుండీ అలవాటే కదా. ఇప్పుడు ఈ నలుపు అంటే ముద్దు అని మన టాలీవుడ్ లో అంటున్నారు. 

సురేష్ కవిరాయని

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.