‘ఆస్కార్‌’ సినిమా తీసిన తెలుగమ్మాయి

ABN , First Publish Date - 2022-10-03T05:59:09+05:30 IST

ఈసారి ఆస్కార్‌ బరిలో మన తెలుగు సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నిలుస్తుందని అంతా అనుకొన్నారు. కానీ ఆ అవకాశం మనకు దక్కలేదు. అయితే.. మన తెలుగమ్మాయి నిర్మించిన...

‘ఆస్కార్‌’ సినిమా తీసిన తెలుగమ్మాయి

ఈసారి ఆస్కార్‌ బరిలో మన తెలుగు సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నిలుస్తుందని అంతా అనుకొన్నారు. కానీ ఆ అవకాశం మనకు దక్కలేదు. అయితే.. మన తెలుగమ్మాయి నిర్మించిన ఓ సినిమా మాత్రం ఆస్కార్‌కి వెళ్లింది. అదే... ‘జాయ్‌ లాండ్‌’. ఇదో పాకిస్థానీ చిత్రం. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లంతా దాదాపుగా పాకిస్తానీయులే. దీనికిఅపూర్వ నిర్మాత. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో స్థిరపడిన అపూర్వ కొన్ని లఘు చిత్రాల్ని, ఇండిపెండెంట్‌ ఫిల్మ్స్‌ నిర్మించారు. వాటిలో చాలా వరకూ అవార్డులు అందుకొన్నవే. అపూర్వ తండ్రి హరి చరణ్‌ప్రసాద్‌ కూడా నిర్మాతే. ఆయన నిర్మించిన ‘కమలి’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఆ స్ఫూర్తితోనే అపూర్వ నిర్మాతగా మారారు. ‘జాయ్‌ లాండ్‌’ని  పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. కొన్ని అవార్డులూ అందుకొంది. ఇప్పుడు ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పాకిస్థాన్‌ నుంచి అఫీషియల్‌ ఎంట్రీగా ఆస్కార్‌కు వెళ్లింది. 


Updated Date - 2022-10-03T05:59:09+05:30 IST