‘భీమ్లా నాయక్’: తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్

ABN , First Publish Date - 2022-02-23T23:19:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదవ షోకి అనుమతి ఇస్తున్నట్లుగా ప్రత్యేక జీవోని తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల..

‘భీమ్లా నాయక్’: తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదవ షోకి అనుమతి ఇస్తున్నట్లుగా ప్రత్యేక జీవోని తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దీంతో చిత్రయూనిట్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ చిత్రంపై కక్షపూరిత వాతావరణమే కనబడుతుంది. ఏపీలోని కొన్ని జిల్లాలలో ‘భీమ్లా నాయక్‌’ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించడమే కాకుండా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్‌ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా.. నేడు (బుధవారం) ‘భీమ్లా నాయక్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుండగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ వేడుకను భారీగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.  

Updated Date - 2022-02-23T23:19:54+05:30 IST