నవ్వినందుకు ముఖం పగులగొట్టాడు.. హాలీవుడ్ హీరోపై మాజీ భార్య విమర్శలు

ABN , First Publish Date - 2022-05-05T17:19:32+05:30 IST

‘పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జానీ డెప్. గత కొన్ని నెలల క్రితం..

నవ్వినందుకు ముఖం పగులగొట్టాడు.. హాలీవుడ్ హీరోపై మాజీ భార్య విమర్శలు

‘పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జానీ డెప్. గత కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఈ నటుడి నుంచి ఇటీవలే ఆయన భార్య అంబర్ హెర్డ్ విడాకులు తీసుకుంది. ఆ కేసులో భాగంగా చిన్న విషయాలకు కొట్టేవాడని, డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పింది. ఇది సాకుగా చూపి జానీ, అంబర్‌పై 50 మిలియన్ డాలర్లు అంటే భారతీయ రూపాయల్లో దాదాపు 38 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. దీంతో అంబర్‌ సైతం అబద్ధాలు ఆడుతుందని ప్రచారం చేస్తూ పరువు తీశాడని జానీపై 100 మిలియన్ డాలర్లకు అంటే దాదాపు 76 కోట్ల రుపాయలకు దావా వేసింది.


ఈ కేసు విషయమై యూఎస్ కోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఆ సమయంలో అంబర్ మాట్లాడుతూ.. ‘పెళ్లైన కొద్దిరోజులకే మొదటిసారి జానీ ఒంటిపై టాటూ గురించి అడిగినప్పుడు కొట్టాడు. అప్పుడు నేను ఆ టాటూ ఏంటని అతన్ని అడిగా. ‘వినో’ అని అతను నాకు చెప్పాడు. అది జోక్ కావొచ్చని నేను గట్టిగా నవ్వేశా. దాంతో నా ముఖం మీద గట్టిగా కొట్టాడు. నాకు అర్థంకాక అలాగే నిలుచుండిపోయా. వెంటనే మరో రెండుసార్లు ముఖం మీద గట్టిగా గుద్దిన అతను ఇది జోక్ అనుకుంటున్నావా అంటూ బూతులు తిట్టాడు.


అదే కాదు తర్వాత సైతం ఎన్నోసార్లు నాపై దాడి చేశాడు. కానీ భరించుకుంటూ వచ్చాను. దానికి కారణం గొడవపడిన ప్రతిసారి ఇంకోసారి ఇలా జరగదని మాట ఇస్తుండేవాడు. అది నిజమే అని నేను నమ్మేదాన్ని. ఒకసారైతే అతనికి సంబంధించిన డ్రగ్స్ నేను దాచేశానేమోనని నా బట్టలు విప్పించి మరి చెక్ చేశాడు’ అని చెబుతూ కన్నీటీ పర్యంతమైంది. అనంతరం జానీ డెప్ మాట్లాడుతూ ‘వినో’ అంటే తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ వినోనా రైడర్ పేరు అని, ఆమె గుర్తుగా టాటూ వేయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-05T17:19:32+05:30 IST