SSMB 28 లో తరుణ్..క్లారిటీ ఇదే..!

ABN , First Publish Date - 2022-08-31T20:01:40+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతుంది. అయితే, దీనిలో తరుణ్ (Tarun)

SSMB 28 లో తరుణ్..క్లారిటీ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతుంది. అయితే, దీనిలో తరుణ్ (Tarun) కీలక పాత్రను పోషించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి గతంలో అతడు, ఖలేజా చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీటవుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగానూ ప్రకటించారు.


అయితే, ఈ సినిమాలో తరుణ్ కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ రాసిన ఓ ముఖ్య పాత్రను తరుణ్‌తో చేయించాలనుకున్నట్టు, అందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ, ఇందులో నిజం లేదని తేలిపోయింది. స్వయంగా ఈ విషయాన్ని తరుణ్ వెల్లడించారు.


నన్ను SSMB 28 సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదు. ఈ వార్త నిజం కాదు..అని తరుణ్ పేర్కొన్నారు. నాకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా అభిమానులతో పంచుకుంటాను అని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా తర్వాత లవర్ బాయ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకొని చాలా బిజీ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగారు. అయితే, గత కొంత కాలంగా సినిమాలకు గాప్ తీసుకున్నారు. మరి ఇప్పుడు వచ్చిన పుకార్లు నిజం చేస్తూ రీ ఎంట్రీ ఎప్పుడిస్తారో చూడాలి.  కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.

Updated Date - 2022-08-31T20:01:40+05:30 IST