తరువాత బాధపడినా లాభం ఉండదు... అందుకే, ఇప్పుడే ‘ఆ పని’ చేసేస్తానంటోన్న Bollywood తార!

ABN , First Publish Date - 2022-05-02T23:14:13+05:30 IST

‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో బీ-టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చింది... అల్ట్రా గార్జియస్ అందగత్తె... తారా సుతారియా. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేసింది లేడి పిల్లా! తరువాత పలు చిత్రాల్లో కనిపించిన తార ఈ మధ్య ‘హీరోపంతి 2’ సినిమాలో తళుక్కుమంది. అందులో ఆమె తన ఫస్ట్ హీరో టైగర్ తో...

తరువాత బాధపడినా లాభం ఉండదు... అందుకే, ఇప్పుడే ‘ఆ పని’ చేసేస్తానంటోన్న Bollywood తార!

‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో బీ-టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చింది... అల్ట్రా గార్జియస్ అందగత్తె... తారా సుతారియా. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేసింది లేడి పిల్లా! తరువాత పలు చిత్రాల్లో కనిపించిన తార ఈ మధ్య ‘హీరోపంతి 2’ సినిమాలో తళుక్కుమంది. అందులో ఆమె తన ఫస్ట్ హీరో టైగర్ తో మరోమారు స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, తన లెటెస్ట్ బాలీవుడ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హాలీవుడ్ ను ప్రస్తావించింది తారా సుతారియా... 


హాలీవుడ్ దిశగా తన అడుగులు వడివడిగానే పడుతున్నాయని చెబుతోంది యంగ్ బ్యూటీ తార. అక్కడి వారితో తాను ఇప్పటికే కొన్ని చర్చలు చేశానని కూడా ప్రకటించింది. అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం బాలీవుడ్ మీదే దృష్టి పెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే, ఆమె ఖాతాలో ‘హీరోపంతి 2’ తరువాత మరో మూడు చిత్రాలున్నాయి. అవన్నీ పూర్తి చేసిగానీ ఈ బ్యూటిఫుల్ ఏంజిల్... లాస్ ఏంజిలిస్ నగరానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే ఛాన్స్ లేదు. కాస్త ఆలస్యమైనా ముందు, ముందు తాను హాలీవుడ్ వెళ్లటం పక్కా అంటోంది హాటీ. ఎందుకంటే, పుణ్యకాలం గడిచిపోయాక తీరిగ్గా చింతిస్తే లాభం లేదంటోంది తార. హాలీవుడ్ డ్రీమ్స్ అంటూ ఎలాగూ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లి నటనతో పాటూ స్వరంతోనూ అలరించేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పేసింది, మిస్ సుతారియా... 


తార కేవలం నటి మాత్రమే కాదు... మంచి సింగర్ కూడా. అందుకే, పశ్చిమానికి వెళ్లి పదాలు వల్లిస్తానంటోంది. నటిగా, గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటోంది. ఇప్పటికే మన గ్లోబల్ ‘దేసీ గాళ్’ ప్రియాంక అమెరికాలో సత్తా చాటుతోన్న సంగతి మనకు తెలిసిందే. ఆమె బాటలోనే తారా కూడా హాలీవుడ్ తారా పథంలోకి దూసుకుపోవాలని మనమూ కోరుకుందాం... 

Updated Date - 2022-05-02T23:14:13+05:30 IST