Tapsee డ్రీమ్ రోల్ అదేనట!

Twitter IconWatsapp IconFacebook Icon
Tapsee  డ్రీమ్ రోల్ అదేనట!

బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీస్ లిస్ట్‌లో తాప్సీ పన్ను (Tapsee Pannu) పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె సొంతం. ఒక పాత్ర చేస్తే దానికి నూరు శాతం న్యాయం చేయడం ఆమె స్పెషాలిటీ. ప్రస్తుతం తాప్సీ చేతిలో బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఆమె నటించిన తాజా చిత్రం ‘శభాష్ మిథు’ (Sabhas Mithu). ఇండియన్ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ నెల 15న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ‘శభాష్ మిథు’ చిత్రం ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా తాప్సీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. 

‘శభాష్ మిథు’ చిత్రం గురించి పలు విశేషాల్ని వెల్లడించిన తాప్సీ.. తన డ్రీమ్ రోల్ ఏంటో చెప్పింది. ‘సూపర్ హీరో పాత్ర చేయాలన్నది నా డ్రీమ్.. అది కూడా ‘ది అవెంజర్స్’ (The Avengers ) సిరీస్‌లో నటించాలి. అందులో ఆల్రెడీ ఉన్న పాత్ర కాకుండా.. నా కోసం ప్రత్యేకించి ఇండియన్ సూపర్ హీరో పాత్ర డిజైన్ చేయాలి. ఇదే నా అతి పెద్ద డ్రీమ్’.. అని తాప్సీ తన మనుసులోని కోరికను వెల్లడించింది. తాప్సీ గతంలో ఎన్నో మహిళా ప్రధాన్యమున్న చిత్రాల్లో నటించింది. వాటిలో చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ‘శభాష్ మిథు’ చిత్రంలోని ఆమె పాత్ర సూపర్ హీరో లాంటిదే అని ఆ సినిమా నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. 

తాప్సీ ఈ సినిమా తర్వాత నటిస్తున్న మరో అతి ముఖ్యమైన చిత్రం ‘డంకీ’ (Dunki). కింగ్ ఖాన్ షారుఖ్ (Sharukh), రాజ్‌కుమార్ హిరాణి (Rajkumar Hirani) కలయికలోని తొలి చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇందులో తాప్సీ.. ఇదివరకెన్నడూ చేయని కొత్త తరహా పాత్ర చేస్తోంది. మరో పక్క ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ.. తొలి ప్రయత్నంగా ఒక  భారీ సినిమా నిర్మిస్తోంది. అందులో సమంత లీడ్ రోల్ చేస్తోందని తాప్పీనే ఇటీవల ప్రకటించింది. అతి త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మరి తాప్సీ డ్రీమ్ రోల్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.