నిర్మాతగా తాప్సీ

ABN , First Publish Date - 2021-07-16T08:57:04+05:30 IST

బాలీవుడ్‌ కథానాయికలు అలియాభట్‌, కంగనారనౌత్‌ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా వారి సరసన హీరోయిన్‌ తాప్సీ కూడా చేరారు....

నిర్మాతగా తాప్సీ

బాలీవుడ్‌ కథానాయికలు అలియాభట్‌, కంగనారనౌత్‌ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా వారి సరసన హీరోయిన్‌ తాప్సీ కూడా చేరారు. ‘అవుట్‌సైడర్స్‌ ఫిల్మ్స్‌’ పేరుతో బ్యానర్‌ను స్థాపించి త్వరలోనే ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ట్విట్టర్‌లో తాప్సీ వెల్లడించారు. నిర్మాత ప్రాంజల్‌ కాంద్‌డియాతో కలసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ‘‘నా 11 సంవత్సరాల కెరీర్‌లో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఇచ్చిన మద్ధతు ప్రేమతోనే ఇది సాధ్యమైంది. నా సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ‘అవుట్‌ సైడర్స్‌ ఫిల్మ్స్‌’తో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను. సినిమా పట్ల నాకున్న ప్రేమను మరింత విస్త్రృతం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని తాప్సీ చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ తమిళంలో ‘ఏలియన్‌’ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ‘శభాష్‌ మిథూ’, ‘దొబారా’, ‘వో లడ్‌కీ హై కహా’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Updated Date - 2021-07-16T08:57:04+05:30 IST