Tanushree Dutta: ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైనా సహాయం చేయండి..

ABN , First Publish Date - 2022-07-21T19:16:06+05:30 IST

బాలీవుడ్‌‌ మూవీ ‘ఆషిక్ బనాయా ఆప్నే(Aashiq Banaya Aapne)’తో గుర్తింపు సాధించిన నటి తనుశ్రీ దత్తా..

Tanushree Dutta: ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైనా సహాయం చేయండి..

బాలీవుడ్‌‌ మూవీ ‘ఆషిక్ బనాయా ఆప్నే(Aashiq Banaya Aapne)’తో గుర్తింపు సాధించిన నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta). 2005లో విడుదలైన ఈ మూవీలోని ‘ఆషిక్ బనాయా’ అనే రొమాంటిక్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా ఈ భామకి పాపులారిటీ వచ్చింది. 2005 నుంచి 2010 వరకు సినిమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ అనంతరం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత మీటూ కార్యక్రమం ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2018లో ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) ఆమెను లైంగిక వెధింపులకి గురి చేసినట్లు లారా తెలిపింది. ఆ ఘటన 2009లో చేసిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో జరిగినట్లు చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తను వేధింపులకు గురవుతున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ పోస్టులో లారా చెప్పుకొచ్చింది.


లారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టులో.. ‘నన్ను టార్గెట్ చేసి.. చాలా దారుణంగా వేధిస్తున్నారు. దయచేసి ఎవరైనా ఏదైనా చేయండి. నాకు సహాయం చేయండి. గత సంవత్సరం బాలీవుడ్‌లో నాకు అవకాశాలు రాకుండా చేశారు. తర్వాత తాగే నీటిలో మందులు, స్టెరాయిడ్స్‌ కలిపి ఇవ్వడానికి ఒక పనిమనిషిని ఆరేంజ్ చేశారు. దాని కారణంగా పలు రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత మేలో నేను ఉజ్జయినికి పారిపోయినప్పుడు నా వాహనం బ్రేకులు రెండుసార్లు పాడైపోవడంతో ప్రమాదం జరిగింది. చాలా కష్టంగా మరణం నుంచి తప్పించుకుకోగలిగాను. సాధారణ జీవితంలోకి అడుగుపెట్టి పనిని తిరిగి ప్రారంభించడానికి 40 రోజుల తర్వాత ముంబైకి తిరిగి వచ్చాను. ఇప్పుడు నేను ఉండే భవనంలోని నా ఫ్లాట్ బయట వింత, అసహ్యకరమైన విషయాలు జరుగుతున్నాయి.


నేను చెప్పేది చెవులు రిక్కించి వినండి. నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోను. అలాగని నేను ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. నా పబ్లిక్ కెరీర్‌లో మునుపెన్నడూ లేనంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇక్కడే ఉన్నాను. బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ (దీని ప్రభావం ఇప్పటికీ ఉంది), దుర్మార్గపు జాతీయ వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పనులు చేస్తాయి.


వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన మీటూ నేరస్థులు, NGO వారే ఉన్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. అందుకే వారు నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు?? ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడాలి. చాలామంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. అయినప్పటికీ భయపడకుండా నేను చాలాకాలంగా ఇన్‌స్టాలో అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తున్నాను. నేను తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నా. అన్యాయానికి వ్యతిరేకంగా పొరాడినందుకు చిన్నపిల్లలు, అమ్మాయిలను వేధించి చంపే చోటులో మనం ఉన్నామా??


మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, సైనిక పాలన ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ విషయాలపై కూడా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు బాధపడుతున్నారు. ఇక్కడ భారీస్థాయిలో మార్పులు జరగాలి. ఈరోజు నేను వేధింపులకి గురవుతున్నా. రేపు నువ్వు కూడా కావచ్చు. నేను ఇటీవల నా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని విషయాలను చర్చించాను. అవి కొంతమందిని తప్పుగా చూపించినట్లు నేను భావిస్తున్నాను. అదే నాకు సంబంధం లేని వ్యక్తులు కూడా నన్ను ఇలా టార్గెట్ చేయడానికి కారణం.. ఇవి చూస్తుంటే ఆ రూమర్స్ అని నిజమే కావొచ్చు అనిపిస్తోంది. 


ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నా ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తాను. నా ఆత్మను మరింత బలోపేతం చేస్తాను. నేను పొందుతున్న కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాలని, కొత్త జీవితం ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ నగరంలో శాంతిభద్రతలు లేవు. కళాకారులు, ఒంటరి మహిళలకు రక్షణ ఉండాలి. హే కృష్ణా! సోదర నాకు సహాయం చెయ్యి’ అంటూ సుదీర్ఘంగా, ఎంతో ఎమోషనల్‌గా పోస్టులో రాసుకొచ్చింది.



Updated Date - 2022-07-21T19:16:06+05:30 IST