Tanushree Dutta: నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు.. బాలీవుడ్ బ్యూటీ వ్యాఖ్యలకి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-23T19:39:57+05:30 IST

‘ఆషిక్ బనాయా’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. బాలీవుడ్‌లో మీటూ..

Tanushree Dutta: నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు.. బాలీవుడ్ బ్యూటీ వ్యాఖ్యలకి కారణమేంటంటే..

‘ఆషిక్ బనాయా’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమంపై పెదవి విప్పిన వారిలో తనుశ్రీ దత్తా ఒకరు. దాని కారణంగా ఆమెపై హత్యాయత్నాలు జరిగినట్లు ఈ భామ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందులో తనుశ్రీ మాట్లాడుతూ.. ‘నేను ఉజ్జయినిలో ఉన్నప్పుడు.. నా కారు బ్రేకులను ఎవరో రెండుసార్లు ట్యాంపరింగ్ చేశారు. దీని వల్ల నాకు చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. నా ఎముకలు విరగకుండా తృటిలో తప్పించుకున్నాను. నా గాయాలు పూర్తిగా నయం కావడానికి చాలా సమయం పట్టింది. ఆ ప్రమాదంలో చాలా రక్తం పోయింది’ అని బాధగా చెప్పుకొచ్చింది.


ఒకసారి తనపై ఎవరో విష ప్రయోగానికి ప్రయత్నించారని తనుశ్రీ తెలిపింది. దీని గురించి ఈ భామ మాట్లాడుతూ.. ‘నా దగ్గర ఒక లేడీ పనిమనిషిగా పని చేస్తోంది. ఆమె మా ఇంట్లో అన్ని పనులు చేసేది. ఆమె వచ్చిన తర్వాత నాకు చాలా జబ్బులు వచ్చాయి. ఆమె నేను తాగే నీళ్లలో ఏదో కలిపినట్లు అనిపిస్తుంది’ అని చెప్పింది.


అయితే.. తనుశ్రీ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం అమ్మ తరుఫున తాతగానీ, అలాగే తన బాలీవుడ్ మాఫియా స్నేహితులే కారణమని ఆమె చెప్పింది. ఇంకొంతమంది సైతం తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని తనుశ్రీ చెప్పుకొచ్చింది.


అసలేం జరిగిందంటే..

తనుశ్రీ దత్తా 2008లో ‘హార్న్ ఓకే ప్లీస్’ అనే సినిమాలో నానా పటేకర్‌తో కలిసి నటించింది. ఆ సమయంలో పటేకర్ ఆమెను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడని 2018 నవంబర్‌లో తనుశ్రీ ఆరోపణలు చేసింది. అనంతరం ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు మూలంగా పటేకర్‌ను ‘హౌస్‌ఫుల్ 3’ చిత్రంతోపాటు మరికొన్ని చిత్రాల నుంచి  నానా పటేకర్‌ని తొలగించారు. కానీ జూన్ 2019లో.. అతనికి ఈ కేసు విషయంలో కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చింది.

Updated Date - 2022-09-23T19:39:57+05:30 IST