Pawan Kalyan : ‘జల్సా’ నే కాదు.. ‘తమ్ముడు’ కూడా !

ABN , First Publish Date - 2022-08-28T17:10:19+05:30 IST

పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్.. టాలీవుడ్‌లో జోరుగా కొనసాగుతోంది. ఏదో రెండు సినిమాలతో ఆగిపోతుందనుకున్న ఈ సినిమాల హవా... ఇకపై క్రమం తప్పకుండా ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ట్రెండ్ ఆయా హీరోల పుట్టినరోజులకే పరిమితమైంది.

Pawan Kalyan : ‘జల్సా’ నే కాదు.. ‘తమ్ముడు’ కూడా !

పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్.. టాలీవుడ్‌లో జోరుగా కొనసాగుతోంది. ఏదో రెండు సినిమాలతో ఆగిపోతుందనుకున్న ఈ సినిమాల హవా... ఇకపై క్రమం తప్పకుండా ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ట్రెండ్ ఆయా హీరోల పుట్టినరోజులకే పరిమితమైంది. వీటి స్పీడ్ చూస్తుంటే.. రాబోయే కాలంలో అవి బ్లాక్ బస్టర్ యానివర్సరీలకు సైతం స్పెషల్ ప్రీమియర్స్ గా వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ కు మహేశ్ బాబు (Maheshbabu) బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోకిరి’ (Pokiri) నాంది పలికిన సంగతి తెలిసిందే. దీనికి ఏకంగా రూ. 1కోటి డబ్బై లక్షల గ్రాస్ వసూలైంది. అలాగే చిరు (Chiru) బర్త్ డే నాడు.. ముప్పైఏళ్ళ ‘ఘరానామొగుడు’ (Gharanamogudu) కు సైతం చాలా చోట్ల మంచి వసూళ్ళు దక్కాయి. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంతు వచ్చింది. 


పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లోని ‘జల్సా’ (Jalsa) చిత్రం పద్నాలుగు ఏళ్ళ క్రితం ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే.  ఆల్రెడీ ఈ సినిమాను రీమాస్టర్ చేసి విడుదలకు సిద్ధం చేసి ఉంచారు. ముందుగా సెప్టెంబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ 1కే విడుదల చేస్తున్నారు. టీవీలోనూ, యూట్యూబ్ లోనూ తెగ చూసేసినా ఈ సినిమాను 4కె రిజల్యూషన్ లో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘తమ్ముడు’ (Tammudu) చిత్రాన్ని కూడా లైన్ లో పెడుతున్నారు. ఆగస్ట్ 31 వినాయక చవితి సందర్బంగా పవర్ స్టార్ అడ్వాన్స్డ్ విషెస్ అంటూ పోస్టర్స్ కూడా వేస్తున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.


ఇలా ఒకే హీరో చిత్రాలు రెండు ఒకేసారి పడడం ఆశ్చర్యం అనిపించకమానదు. పవర్ స్టార్ వింటేజ్ లుక్ చూడాలనే ఆసక్తితో అభిమానులు ఈ సినిమాల్ని డబుల్ ధమాకాగా ఫీలవుతున్నారు. 1999లో విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. ఆమిర్ ఖాన్ (Aamir Khan) బాలీవుడ్ చిత్రం ‘జోజితా వహీ సికందర్’ (Jo Jitha Wahi Sikandar) కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ లో దుమ్మురేపేసింది. రమణ గోగుల సంగీతం, పవన్ పెర్ఫార్మెన్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. పి.ఏ అరుణ్ ప్రసాద్ కు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రం. మరి ఈ రెండు చిత్రాలూ అభిమానుల్ని ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.  

Updated Date - 2022-08-28T17:10:19+05:30 IST