చిరు ఒక్కడు వెళ్లినా.. అందరితో వెళ్లినా.. ఇండస్ట్రీ కోసమే: తమ్మారెడ్డి

ABN , First Publish Date - 2022-02-09T23:42:53+05:30 IST

ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రేపు (గురువారం) టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సిఎమ్ జగన్‌ను కలవనున్న సంగతి తెలిసిందే. చిరుతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు

చిరు ఒక్కడు వెళ్లినా.. అందరితో వెళ్లినా.. ఇండస్ట్రీ కోసమే: తమ్మారెడ్డి

ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రేపు (గురువారం) టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సిఎమ్ జగన్‌ను కలవనున్న సంగతి తెలిసిందే. చిరుతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఈ సమావేశానికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ నేపథ్యంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 


ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

-సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి చెప్పటం జరిగింది.

-లాస్ట్ టైమ్ చిరంజీవిగారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిగారితో సమావేశమయ్యారు. మళ్లీ సమావేశం ఉంటుందని చెప్పారు. ఆయన ఒక్కరు వెళ్లినా అందరితో కలిసి వెళ్లినా.. అది ఇండస్ట్రీ కోసమే అని అంతా భావించాలి.

-సమస్యల గురించి చెప్పాలంటే.. ఆన్‌లైన్ టికెటింగ్ అడిగాము ఎందుకంటే బుక్ మై షో లో ప్రొడ్యూసర్‌కి మనీ రావటం లేదు.. అదే ఆన్‌లైన్‌లో చేస్తే ప్రొడ్యూసర్స్‌కి ప్రాఫిట్ వస్తుంది.


-డిజిటల్, క్యూబ్ వాళ్ళు డైలీ మనీ తీసుకునే వారు ఉన్నారు. చిన్న సినిమా వాళ్ళకి లాస్ వస్తుంది. అదే ఛాంబర్ ద్వారా డిజిటల్ మరియు క్యూబ్ వాళ్ళకి మనీ ఇస్తే చిన్న సినిమా వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుంది.

-పెద్ద సినిమాలు రిలీజ్ సమయంలో టికెట్ ధరలు పెంచే వెసులుబాటు కావాలి అని అన్నారు. ధరలు పెంచటం వల్ల ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి నష్టం జరిగింది.. అలాగే ‘బంగార్రాజు’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో బాగా కలెక్ట్ చేసింది, తెలంగాణలో కలెక్ట్ చేయలేకపోయింది. అఖండ, పుష్ప సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. అఖండ కన్నా పుష్ప ఎక్కువ కలెక్ట్ చేసింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ అవ్వటం వలన అంత కలెక్ట్ చేసింది.

-టికెట్లను ఎక్కువ రేటుకు అమ్మేస్తాను అంటే సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టుకోకూడదు.

-చిన్న సినిమాలకు కొన్ని వారాలు అని థియేటర్సలో కేటాయించాలి.. ఒక షో ఎక్కువ వేసుకునే లాగా వెసులుబాటు ఇవ్వాలి.

-అవార్డ్స్ ఇవ్వటం లేదు. నంది అవార్డ్స్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే సింహా అవార్డ్స్ అని తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించాయి కానీ

ఏ గవర్నమెంట్ ఇవ్వటం లేదు..

-సినిమాలకి గవర్నమెంట్‌లు సబ్సిడీ‌లు ఇవ్వాలి, అలాగే తెలంగాణలో లొకేషన్ చార్జెస్ తీసివేయమని అడిగాము.. ఆంధ్రలో ఇచ్చారు ఇక్కడ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాము.

-థియేటర్స్ కొరత లేకుండా మినీ థియేటర్స్‌ని ఎంకరేజ్ చేయాలి. ఏపీలో విజయవాడ బస్టాప్‌లో మరియు ఏలూరులో రెండు చోట్ల పెట్టారు.. బాగా నడుస్తున్నాయి. ఇంకా పెట్టాలి, అలాగే తెలంగాణలో కూడా ఎంకరేజ్ చేయాలి.

-వర్కర్స్‌కి ఇ.ఎస్.ఐ, ప్రొవిడెంట్ ఫండ్, మెడికల్ సదుపాయాలు గురించి ఆలోచించాలి.

-థియేటర్‌కి పవర్ చార్జెస్ కమర్షియల్ కాకుండా ఆక్టివ్ చార్జెస్ తీసుకోవాలి. థియేటర్స్ కోవిడ్ వల్ల చాలా నష్టపోయాయి. రెండు రాష్ట్రాలలో తీసివేస్తామని అన్నారు కానీ తీయలేదు. వాటిని కూడా పరిష్కరించాలి.

-టికెట్స్ ధరల వల్ల రెవిన్యూ రావటం లేదు అనటం కరెక్ట్ కాదు. పాతకాలంలా లేదు.. ఇప్పుడు సినిమా పాన్ ఇండియా అయిపోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ టికెట్స్ రేట్స్ తగ్గించటం వలన సినిమా రెవిన్యూ పడిపోదు.

-మా దగ్గర కూడా కొన్ని తప్పులు జరిగాయి ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అంటే రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పటం లేదు.. కొంత లగ్జరీ కాస్ట్ తగ్గించుకోవాలి. ఆ విషయంలో అంతా కాంప్రమైజ్ కావాలి.

-పుష్పకి నార్త్ ఇండియాలో ఒక ఛానల్‌లో మాత్రమే యాడ్ వేశారు. అక్కడ పబ్లిసిటీ కోసం కేవలం రెండు కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నార్త్‌లో హైయస్ట్ కలెక్ట్ చేసింది. ఫైనల్‌గా కంటెంట్ ఇజ్ దా బాస్.

-అందరం ఇండస్ట్రీ కోసం మాట్లాడాలి, టికెట్స్ రేట్స్ వల్ల ఇండస్ట్రీ సమస్యలు డైవర్షన్ అవుతున్నాయి. నేను ఇండస్ట్రీ మంచి కోసం మాట్లాడుతున్నాను. చిరంజీవిగారిని పిలిచినప్పుడు ఆయనే వెళ్తారు.. ఆయన దగ్గరికి వెళ్లి నేనూ వస్తాను అని అడగలేను కదా. గవర్నమెంట్ వాళ్ళు కూడా చిరంజీవి గారితో పాటు వాళ్ళని పిలిస్తే మిగతా వాళ్ళు కూడా వెళ్లేవారు, పిలవకుండా వెళ్లరు కదా. దీని వల్ల చిరంజీవిగారికి డామేజ్ జరుగుతుంది.. అయన చేసింది ఏమీ లేదు సీఎంగారు పిలిస్తే అయన వెళ్లారు. ప్రభుత్వానికి పిలవవలసిన బాధ్యత ఉంది.. పిలిస్తే తప్పకుండా వెళ్తాము. తెలంగాణ ప్రభుత్వం వారు పిలిచారు, ఆంధ్ర నుంచి పిలవలేదు.

-ఎవరు అయినా ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి అప్పీల్ చేయాలి.. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. ఓపెన్‌గా చెప్పాలి అంటే గతం‌లో టికెట్ రేట్స్ ఇష్టం వచ్చినట్టు పెంచి టాక్స్ కట్టలేదు.. అందువల్ల గవర్నమెంట్ టికెట్ ఇష్యూ తీసుకువచ్చింది, ఇప్పుడు టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వండి టాక్స్ అన్ని కరెక్ట్‌గా కడతాం అని కోరుకుంటున్నాం.

-నన్ను ఎవరూ వెళ్లి మాట్లాడమని చెప్పలేదు, మా గురువుగారు దగ్గర శిష్యరికం చేసిన అలవాటుతో ఈ బాధ్యత తీసుకున్నా. అందువల్లే ఈ మీడియా సమావేశం పెట్టాను.

-టికెట్స్ రేట్స్ కంటే ఫుడ్ ఐటమ్స్ రేటు ఎక్కువగా ఉంది. వాటి గురించి కూడా చెప్పాము కానీ పట్టించుకోవటం లేదు. కానీ ఇక్కడ మన వీక్‌నెస్ కూడా ఉంది. సింగిల్ స్క్రీన్స్‌కి వెళ్లకుండా మల్టీ‌ఫ్లెక్స్‌కి అలవాటు పడటం వల్లే ఇది జరుగుతుంది.

Updated Date - 2022-02-09T23:42:53+05:30 IST