విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత..

ABN , First Publish Date - 2021-12-29T19:23:39+05:30 IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. 2021లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ జంట..

విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత..

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. 2021లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ జంట.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ నటులు నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకోగా.. తాజాగా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్, భార్య మోనికా రిచర్డ్‌తో బంధానికి ముగింపు పలికినట్లు తాజాగా ప్రకటించాడు.


నిజానికి మోనికాతో 2020లోనే విడాకులు తీసుకున్నడటా ఇమ్మాన్. కానీ ఆ విషయాన్ని సీక్రేట్‌గా ఉంచి.. దాదాపు సంవత్సరం తర్వాత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్‌. 


‘అన్నివేళలా నాకు సపోర్టుగా నిలిచిన నా శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మా జీవితాలు వేరే దారుల్లో తీసుకుపోతున్నందున.. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020లో పరస్పర అంగీకారంతో చట్టప్రకారం డైవోర్స్ తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలం కాదు. మీడియాతో పాటు అభిమానులు, మిగిలిన అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో వెళ్లేందుకు సహాయం పడతారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాల’ని సోషల్ మీడియా పోస్ట్‌‌లో రాసుకొచ్చాడు ఇమ్మాన్‌.


అయితే, ఇమ్మాన్ 2008లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ కలిగారు. అయితే వివిధ కారణాల వల్ల దాదాపు 13 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా, 2002లో వచ్చిన తమిళ నటుడు విజయ్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన ఇమ్మాన్.. అనంతరం రజనీకాంత్, అజిత్ వంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకి పని చేశాడు. అంతేకాకుండా 2019లో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు.



Updated Date - 2021-12-29T19:23:39+05:30 IST