సినీ దర్శకుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-03-15T16:05:03+05:30 IST

తూత్తుకుడిలో అనుమతి లేకుండా ఆందోళన జరిపేందుకు వెళ్ళిన తమిళ్‌ పేరరసు పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ దర్శకుడు గౌతమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెన్‌కాశి సమీపంలోని కురింజాకుళం గాంధారియమ్మన్‌

సినీ దర్శకుడి అరెస్టు

 చెన్నై: తూత్తుకుడిలో అనుమతి లేకుండా ఆందోళన జరిపేందుకు వెళ్ళిన తమిళ్‌ పేరరసు పార్టీ ప్రధాన కార్యదర్శి,  సినీ దర్శకుడు గౌతమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెన్‌కాశి సమీపంలోని కురింజాకుళం గాంధారియమ్మన్‌ ఆలయ ఆరాధన హక్కుల సాధన ఉద్య మంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురికి సంస్మరణ స్థూపాన్ని, గాంధారియమ్మన్‌ విగ్రహ పీఠానికి శంకుస్థాపన చేసి ధర్నా జరిపేందుకు ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి సోమవారం ఉదయం తూత్తుకుడి చేరుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు గౌతమన్‌ను విమానాశ్రయం వద్దనే అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించి సాయంత్రానికి విడిచిపెట్టారు. 


Updated Date - 2022-03-15T16:05:03+05:30 IST