Tamannaah: రజినీకాంత్ సినిమాలో మిల్కీ బ్యూటీ నటించనుందా..?

ABN , First Publish Date - 2022-08-11T20:29:20+05:30 IST

Tamannaah: రజినీకాంత్ సినిమాలో మిల్కీ బ్యూటీ నటించనుందా..?

Tamannaah: రజినీకాంత్ సినిమాలో మిల్కీ బ్యూటీ నటించనుందా..?

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth). తాజాగా అతడు నటిస్తున్న సినిమా ‘జైలర్’ (Jailer). నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. 


‘జైలర్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో సెట్స్‌ను వేశారు. ఈ సినిమాలో నటిస్తున్నట్టు కొన్ని రోజుల క్రితమే రమ్య కృష్ణ (Ramya Krishna) తెలిపింది. ఆగస్టు 10నుంచి షూటింగ్‌‌లో జాయిన్ కాబోతున్నట్టు వెల్లడించింది. ‘జైలర్’ ను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. నెల్సన్ ఈ మూవీని కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాడు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ (Shivarajkumar)కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీ కాంత్ చివరగా ‘పెద్దన్న’ లో నటించాడు. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా రజినీ అభిమానులను మెప్పించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది.

Updated Date - 2022-08-11T20:29:20+05:30 IST