Tamannaah: అదంటే భయం.. హాలీవుడ్‌కి వెళ్తా!

ABN , First Publish Date - 2022-07-08T00:11:51+05:30 IST

ఇటీవల ‘ఎఫ్‌3’ చిత్రంతో వినోదం అందించిన తమన్నా కాస్త తీరిక దొరకడంతో నెటిజన్లతో ముచ్చటించారు. గురువారం ఆమె ట్విట్టర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానిమచ్చారు. ఉత్కంఠకు గురి చేస్తే కథ కుదిరితే హారర్‌ చిత్రాల్లో నటిస్తానని, తదుపరి చేయబోయే సినిమాతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తానని అభిమానులకు మాటిచ్చారు

Tamannaah: అదంటే భయం.. హాలీవుడ్‌కి వెళ్తా!

ఇటీవల ‘ఎఫ్‌3’ చిత్రంతో వినోదం అందించిన తమన్నా కాస్త తీరిక దొరకడంతో నెటిజన్లతో ముచ్చటించారు. గురువారం ఆమె ట్విట్టర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానిమచ్చారు. ఉత్కంఠకు గురి చేస్తే కథ కుదిరితే హారర్‌ చిత్రాల్లో నటిస్తానని, తదుపరి చేయబోయే సినిమాతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తానని అభిమానులకు మాటిచ్చారు. ‘భోళా శంకర్‌’లో డాన్స్‌లతో అలరిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ప్రేక్షకులు ఏమాత్రం నిరాశకు లోనుకారు’ అని ప్రామిస్‌ చేశారు మిల్కీబ్యూటీ. Chitchat with Tamannaah


నాలో రౌడీ బయటకొచ్చాడు...

యాక్షన్‌, రొమాన్స్‌ ఎక్కువగా ఉన్న చిత్రాల్ని ఇష్టపడతా. ‘ఎఫ్‌3’లో అబ్బాయి పాత్ర చేయడం కష్టంగా అనిపించింది. ఆ పాత్ర నాకు సవాల్‌ విసిరింది. కానీ ప్రతి సీన్‌ని ఎంజాయ్‌ చేశా. ఆ పాత్ర ద్వారా నాలోని రౌడీని బయటపెట్టినట్లు ఉంది. త్వరలో తమిళ సినిమా చేయబోతున్నా. ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో ‘ధర్మదొరై’లో సుహాసిని, ‘బాహుబలి’లో అవంతిక పాత్రల్ని ఎప్పటికీ మరచిపోలేను. (Tamannaah)



నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌..

పూర్తిగా డాన్స్‌ నేపథ్యంలో సాగే కథలో నటించాలన్నది నా డ్రీమ్‌. అలాంటి ఆఫర్‌ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా. ఇంకా హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. (Tamannaah in Bhola shankar)


ప్రకృతి సహకరిస్తే...

మన కష్టానికి ప్రకృతి కూడా సహకరిేస్త అదే అదృష్టంగా భావిస్తాను. హెల్దీ ఫుడ్‌ తీసుకోవడం, ప్రతిరోజు ఏడు గంటల నిద్ర, కాస్త స్కిన్‌ కేర్‌ తీసుకోవడం.. ఇవే నా చర్మ సౌందర్యానికి కారణం. ఖాళీ సమయంలో ఇష్టమైన పుస్తకాలు చదువుతా. పోడ్‌క్యాస్ట్‌ వింటాను. వర్షంలో డాన్స్‌ చేయడం అంటే చాలా ఇష్టం. జ్ఞాపకశక్తిని కోల్పోవడం అనేది నన్ను భయానికి గురిచేస్తుంది’’ అంటూ తన మనసులో మాటలు చెప్పుకొచ్చారు తమన్నా. 

Updated Date - 2022-07-08T00:11:51+05:30 IST