Tamanna : మాతృభాషలో హిట్టు కొడుతుందా?

ABN , First Publish Date - 2022-05-06T22:11:42+05:30 IST

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చాలా కాలం పాటు చక్రం తప్పింది Tamanna. తెలుగుతో పాటు తమిళంలోనూ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ లోని అగ్రకథానాయకులతో పాటు మీడియం రేంజ్ హీరోల సరసన కూడా అమ్మడు కథానాయికగా మెరిసింది.

Tamanna : మాతృభాషలో హిట్టు కొడుతుందా?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చాలా కాలం పాటు చక్రం తప్పింది Tamanna. తెలుగుతో పాటు తమిళంలోనూ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ లోని అగ్రకథానాయకులతో పాటు మీడియం రేంజ్ హీరోల సరసన కూడా అమ్మడు కథానాయికగా మెరిసింది. అలాగే తమిళ టాప్ హీరోలతోనూ, చిన్న హీరోలతోనూ రొమాన్స్ చేసింది. అయితే తెలుగు, తమిళ భాషల కన్నా ముందు తన మాతృభాషైన హిందీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అక్కడ వర్కవుట్ కాలేదు. దాంతో సౌత్ లో స్థిరపడి టాప్ హీరోయిన్ అయింది Tamanna . అయితే చాలా మంది ముంబై భామల్లాగానే బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించాలనేది తమ్మూ కోరిక. కానీ అది ఎంతకూ నెరవేరడం లేదు. మధ్యలో అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ..  ఆమెకు నిరాశే ఎదురవుతోంది. 


‘హిమ్మత్‌వాలా, ఎంటర్‌టైన్‌మెంట్’ లాంటి చిత్రాలతో Tamanna బాలీవుడ్లో ఓ ప్రయత్నం చేసింది. అయితే ఆ సినిమాలు డిజాస్టర్ అవడంతో ఆమె ఆశలు ఆవిరయ్యాయి. అయినప్పటికీ ఆమె ప్రయత్నం మానలేదు. ఇప్పుడు సౌత్ లో అమ్మడి డిమాండ్ తగ్గడంతో మరోసారి బాలీవుడ్ లో ఇప్పుడు ఆఖరి ప్రయత్నం చేస్తోంది. ‘చాందినీ బార్, హీరోయిన్, ఫ్యాషన్’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన మధుర్ భండార్కర్ తమన్నాలోని కోరికను తిరిగి తట్టిలేపుతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం బాలీవుడ్ లో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. 


మధుర్ భండార్కర్ పనితనంపై మంచి ఆశలు పెట్టుకుంది మిల్కీ బ్యూటీ. చాలా తక్కువ బడ్జెట్ లో, తక్కువ రోజుల్లో సినిమాలు తీసే మధుర్ .. ‘బబ్లీ బౌన్సర్’ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. Tamanna లీడ్ రోల్ లో చాలా తక్కువ టైమ్ లో చిత్రీకరణ పూర్తి చేశాడు మధుర్ భండార్కర్. ఫ్యాక్స్ స్టూడియోస్ తో, మధుర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా హిందీతో పాటు తమన్నా క్రేజ్ దృష్ట్యా  తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కాబోతోంది. మరి కెరీర్ ఎండింగ్ లోనైనా తమ్మూ తన మాతృభాషలో హిట్టుకొట్టి తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటుందేమో చూడాలి.

Updated Date - 2022-05-06T22:11:42+05:30 IST