Abhishek Bachchan : తినటానికి తిండి లేక... తన ఉద్యోగుల వద్దే అమితాబ్ అప్పులు చేశారు!

ABN , First Publish Date - 2021-12-07T22:07:27+05:30 IST

చాలా మందికి అమితాబ్ బచ్చన్ సక్సెస్ మాత్రమే తెలుసు. ఆయన ఫెయిల్యూర్స్ అంతగా తెలియవు. నటుడిగా ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ, ఒక దశలో కమర్షియల్ హీరోగా వాడిపోయాడు. బాక్సాఫీస్ సూపర్‌స్టార్‌గా వాలిపోయాడు. ఆయన వద్దకు సినిమా ఆపర్లు రావటం ఆగిపోయాయి. అదే సమయంలో నిర్మాతగా కూడా చేతులు కాల్చుకున్నాడు బిగ్ బి. కోట్ల రూపాయల నష్టం ఆర్దికంగా కృంగదీసింది. మరి ఆ క్లిష్ట సమయంలో జూనియర్ బచ్చన్ ఏం చేస్తున్నాడు?

Abhishek Bachchan : తినటానికి తిండి లేక... తన ఉద్యోగుల వద్దే అమితాబ్ అప్పులు చేశారు!

చాలా మందికి అమితాబ్ బచ్చన్ సక్సెస్ మాత్రమే తెలుసు. ఆయన ఫెయిల్యూర్స్ అంతగా తెలియవు. నటుడిగా ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ, ఒక దశలో కమర్షియల్ హీరోగా వాడిపోయాడు. బాక్సాఫీస్ సూపర్‌స్టార్‌గా వాలిపోయాడు. ఆయన వద్దకు సినిమా ఆపర్లు రావటం ఆగిపోయాయి. అదే సమయంలో నిర్మాతగా కూడా చేతులు కాల్చుకున్నాడు బిగ్ బి. కోట్ల రూపాయల నష్టం ఆర్దికంగా కృంగదీసింది. మరి ఆ క్లిష్ట సమయంలో జూనియర్ బచ్చన్ ఏం చేస్తున్నాడు?

తన తాజా చిత్రం ‘బాబ్ బిస్వాస్’ ప్రమోషన్స్‌లో భాగంగా అమితాబ్ గురించిన ఓ షాకింగ్ విషయం అభిషేక్ చెప్పాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి తమ ఆర్దిక సంక్షోభం గురించి వివరించాడు. అమితాబ్ తీవ్రమైన నష్టాల్లో మునిగిపోయి, సినిమా ఆఫర్లు లేక అల్లాడిపోతుంటే... అభిషేక్ బోస్టన్ యూనివర్సిటిలో ఉన్నాడట. యాక్టింగ్ కోర్స్ మధ్యలో ఉండగా ఇంటి వద్ద ఆర్దిక కష్టాలు అభిషేక్‌ని కలవరపెట్టాయట. దాంతో బోస్టన్ నుంచీ తాను ముంబైకి తిరిగి వచ్చేస్తానని తండ్రితో చెప్పినట్టు అభిషేక్ వివరించాడు. తరువాత జూనియర్ బచ్చన్ అదే పని చేశాడు కూడా. బోస్టన్ యూనివర్సిటిలో అర్ధాంతరంగా చదువు మానేసి ఇంటికి వచ్చేశాడు. 2000వ సంవత్సరంలో జేపీ దత్తా ‘రెఫ్యూజీ’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ విధంగా తండ్రికి తనకు వీలైనంతగా ఆర్దిక, నైతిక సాయం, సహకారం అందించాడు...

తాను ఫారిన్ నుంచీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమితాబ్ ఆర్దిక స్థితి గురించి వివరిస్తూ అభిషేక్ షాకింగ్ ఫ్లాష్‌బ్యాక్ బయటపెట్టాడు. అప్పట్లో తన తండ్రి, బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి... స్వంత ఉద్యుగుల వద్దే అప్పులు చేసేవాడట. అలా చేయకపోతే కనీసం తినటానికి తిండి కూడా ఉండని స్థితిలో బచ్చన్ ఫ్యామిలీ ఉండేదట. తీవ్రమైన ఆర్దిక ఒడిదుడుకుల్లో అమితాబ్ ఉండగా 2000వ సంవత్సరంలో ‘కేబీసీ’ ఆఫర్ వచ్చింది. గత 21 ఏళ్లలో ఆ షో సరికొత్త బచ్చన్ సాబ్‌ని జనం ముందు ఆవిష్కరించింది! 

Updated Date - 2021-12-07T22:07:27+05:30 IST