3 ఏళ్ల తరువాత కలిసిన ‘TITANIC’ లవ్వర్స్... JACK ను చూసి ఏడుపు ఆపుకోలేకపోయిన ROSE!

ABN , First Publish Date - 2021-12-24T22:38:35+05:30 IST

‘టైటానిక్’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఎవరు? లియనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ పోషించిన ‘జాక్’ అండ్ రోజ్’ పాత్రలు. సినిమాలో వాళ్లిద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘టైటానిక్’ బ్లాక్‌బస్టర్ అవ్వటానికి వాళ్ల అమర ప్రేమే అసలు కారణం. అయితే, రియల్ లైఫ్‌లో కూడా...

3 ఏళ్ల తరువాత కలిసిన ‘TITANIC’ లవ్వర్స్... JACK ను చూసి ఏడుపు ఆపుకోలేకపోయిన ROSE!

‘టైటానిక్’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఎవరు? లియనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ పోషించిన ‘జాక్’ అండ్ రోజ్’ పాత్రలు. సినిమాలో వాళ్లిద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘టైటానిక్’ బ్లాక్‌బస్టర్ అవ్వటానికి వాళ్ల అమర ప్రేమే అసలు కారణం. అయితే, రియల్ లైఫ్‌లో కూడా ‘జాక్ అండ్ రోజ్’ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. లియనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లేట్ ‘టైటానిక్’ సినిమాలో ఎంతగా ఒకర్నొకరు ఇష్టపడ్డారో నిజ జీవితంలోనూ అంతే దగ్గరయ్యారు. అఫ్‌కోర్స్, వారి మధ్య రొమాంటిక్ రిలేషన్ ఏమీ లేదు కానీ... డికాప్రియో అండ్ కేట్ మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్... 


‘టైటానిక్’, ‘రెవల్యూషనరీ రోడ్’ లాంటి సినిమాల్లో కలసి నటించిన లియనార్డో, కేట్ గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నేరుగా కలుసుకోలేదు. కారణం అందరికీ తెలిసిందే... కరోనా. ఈ హాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ మహమ్మారి కారణంగా ఎవరి దేశంలో వారు చిక్కుకుపోయారు. అయితే, రీసెంట్‌గా లాస్ ఏంజిలెస్‌లో తన చిరకాల మిత్రుడ్ని కలుసుకుంది లండన్ బ్యూటీ. ‘‘అతడ్ని చూసిన వెంటనే నేను ఏడుపు ఆపుకోలేకపోయాను...’’ అంటోంది కేట్ విన్‌స్లెట్! కోవిడ్ కారణంగా ఎన్నో అంతర్జాతీయ స్నేహాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మాది కూడా అంతే అంటూ వివరించిన విన్‌స్లెట్ ‘‘అతను నా స్నేహితుడు. చాలా ఆప్తుడైన మిత్రుడు. మాది జీవిత కాల బంధం...’’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది ఆస్కార్ విన్నింగ్ బ్యూటీ... 

Updated Date - 2021-12-24T22:38:35+05:30 IST