‘భీమ్లా నాయక్’... మేము కోరుకునేది ఇదే: తలసాని శ్రీనివాస్ యాదవ్

ABN , First Publish Date - 2022-02-24T03:46:00+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాదే హబ్‌గా ఉండాలనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు..

‘భీమ్లా నాయక్’... మేము కోరుకునేది ఇదే: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాదే హబ్‌గా ఉండాలనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌గారి చిత్రం కోసం సంవత్సరకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలనే ఉద్ధేశ్యంతో.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాల విషయంలో సానుకూలంగా వెళుతూ అన్ని సమస్యలను తీర్చడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కేసీఆర్‌గారు, కేటీఆర్‌గారు ఆదేశాల మేరకు ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము కోరుకునేది ఇండస్ట్రీ బాగుండాలి.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి.. కార్మికులు, ప్రజలు అందరూ బాగుండాలనే కోరుకుంటాం. 24 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ గారికి దినదినం క్రేజ్ పెరుగుతుందే తప్ప.. ఎక్కడా క్రేజ్ తగ్గడం లేదు. వారిని చూస్తుంటే వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అనే అనుమానం వస్తుంటుంది. వారికి అభినందనలు తెలియజేస్తూ.. ‘భీమ్లా నాయక్’ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నాను. పవన్ కల్యాణ్‌గారికి ఉన్న ఇంకో గొప్ప గుణం ఏమిటంటే.. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వడం. ఇది చాలా గొప్ప విషయం. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు’’ అని తెలిపారు.



Updated Date - 2022-02-24T03:46:00+05:30 IST