‘బచ్చన్ పాండే’గా అక్షయ్, ‘జేమ్స్’గా పూనీత్ రాజ్‌కుమార్... OTTల్లో ఈ వారం సందడి!

ABN , First Publish Date - 2022-04-16T19:25:35+05:30 IST

ఏప్రెల్ మంత్‌లో ఓటీటీలు కూడా సమ్మర్ ఎంటర్టైన్మెంట్ బాగానే వడ్డిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఈ వారం చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి...

‘బచ్చన్ పాండే’గా అక్షయ్, ‘జేమ్స్’గా పూనీత్ రాజ్‌కుమార్... OTTల్లో ఈ వారం సందడి!

ఏప్రెల్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా లేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ లాంటి ప్యాన్ ఇండియా చిత్రాల హంగామాతో టికెట్ కౌంటర్స్ కళకళలాడుతున్నాయి. మరోవైపు తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ మూవీ కూడా ఇదే నెలలో జనాన్ని పలకరించింది. ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ప్రస్తుతం థియేటర్లు మాత్రం ఖాళీగా లేవు. ఏదో ఒక సినిమా చూస్తూ చాలా రోజుల తరువాత కరోనా లాక్‌డౌన్ మోడ్ నుంచీ, మూడ్ నుంచీ ప్రేక్షకులు కంప్లీట్‌గా బయటపడిపోయారు. అయితే, ఏప్రెల్ మంత్‌లో ఓటీటీలు కూడా సమ్మర్ ఎంటర్టైన్మెంట్ బాగానే వడ్డిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఈ వారం చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి... 


1. బచ్చన్ పాండే :

అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన యాక్షన్ కామెడీ సినిమా ‘బచ్చన్ పాండే’. కృతీ సనోన్ అప్‌కమింగ్ ఫిల్మ్‌మేకర్ పాత్రలో కనిపించింది. తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’గా రీమేక్ అయిన తమిళ చిత్రం ‘జిగర్‌తాండ‘కి ‘బచ్చన్ పాండే’ హిందీ వర్షన్. అయితే, తమిళ, తెలుగు భాషల్లో ఆడినట్టుగా బాలీవుడ్ తెరపై అక్షయ్ కుమార్ రీమేక్ మూవీ ఆడలేదు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా జోరులో ‘బచ్చన్ పాండే‘ దాదాపుగా కొట్టుకుపోయింది. థియేటర్లో ఈ అక్షయ్, కృతీ, జాక్విలిన్ స్టారర్ ఎంటర్టైనర్‌ని మిస్సైన వారు ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.... 


2. జేమ్స్ :


దివంగత పూనీత్ రాజ్‌కుమార్ హీరోగా అభిమానుల ముందుకొచ్చిన సినిమా ‘జేమ్స్’. ఓ డ్రగ్స్ దందా చేసే కుటుంబాన్ని కాపాడే బాధ్యత హీరో సంతోష్ కుమార్ పాత్రపై ఉంటుంది. అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఏం జరిగిందన్నదే ‘జేమ్స్’ స్టోరీ. పూనీత్ రాజ్‌కుమార్‌తో పాటూ ప్రియా ఆనంద్, శివ రాజ్‌కుమార్, ఆర్. శరత్‌కుమార్, శ్రీకాంత్, ఆదిత్య మెనన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సోనీ లివ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, ఈ సినిమా... 


3. డెత్ ఆన్ ద నైల్ :

ఇండియన్ మూవీ లవ్వర్స్‌కే కాదు హాలీవుడ్ సినీ ప్రియులకి కూడా మంచి క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులో ఉంటోంది ఈ వారాంతంలో. అదే ‘డెత్ ఆన్ ద నైల్’. గాల్ గాడోట్, కెన్నెత్ బ్రానాగ్, ఆర్మీ హామర్ వంటి వారు నటించిన ఈ సినిమాలో ఈజీప్టులో జరిగిన ఓ హత్య చుట్టూ కథ తిరుగుతుంది. ‘డెత్ ఆన్ ద నైల్’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు... 


4. మై :

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న వెబ్ సిరీస్ ‘మై’. తన కూతుర్ని ఎవరు చంపారు అన్న ప్రశ్నతో ఓ తల్లి చేసే సాహసోపేత ప్రయాణమే ఈ సిరీస్‌లోని కథ. సీనియర్ నటి సాక్షి తన్వర్ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. 


5. అనాటొమీ ఆఫ్ ఏ స్కాండల్ : 

నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో వెబ్ సిరీస్ ‘అనాటొమీ ఆఫ్ ఏ స్కాండల్’. ఓ రాజకీయ నాయకుడి సంపన్న భార్య చుట్టూ ఈ షో కథ సాగుతుంది. ఆ ఇన్‌ఫ్లుయెన్షల్ వైఫ్ కనుగొన్న సీక్రెట్ స్కాండల్ ఏంటి? తరువాత ఆమె ఏం చేసింది అన్నదే థ్రిల్ కలిగించే అంశం. సియెన్నా మిల్లర్, మైకెల్ డాకెరీ రూపర్ట్ ఫ్రెండ్ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-04-16T19:25:35+05:30 IST