‘చోటే నవాబ్’ రాజసం... రాజ్‌కపూర్‌లా ఉన్నాడంటోన్న నెటిజన్స్!

ABN , First Publish Date - 2022-03-07T01:48:21+05:30 IST

కరీనా, సైఫ్ అలీఖాన్ వారసుడు తైమూర్ ఆల్రెడీ క్రేజీ సెలబ్రిటీ! అతడు పుట్టినప్పటి నుంచీ పాపరాజీ కెమెరాల ఆత్రుత అంతా ఇంతా కాదు. ఒక్క ఫోటో దొరికినా చాలు అన్నట్టు ఉంటుంది బాలీవుడ్ మీడియా వ్యవహారం. అయితే, ప్రస్తుతం మరోసారి బీ-టౌన్‌లో తైమూర్ చర్చ కొనసాగుతోంది. చోటే నవాబ్ నయా ఫోటో వైరల్ గా మారింది.

‘చోటే నవాబ్’ రాజసం... రాజ్‌కపూర్‌లా ఉన్నాడంటోన్న నెటిజన్స్!

కరీనా, సైఫ్ అలీఖాన్ వారసుడు తైమూర్ ఆల్రెడీ క్రేజీ సెలబ్రిటీ! అతడు పుట్టినప్పటి నుంచీ పాపరాజీ కెమెరాల ఆత్రుత అంతా ఇంతా కాదు. ఒక్క ఫోటో దొరికినా చాలు అన్నట్టు ఉంటుంది బాలీవుడ్ మీడియా వ్యవహారం. అయితే, ప్రస్తుతం మరోసారి బీ-టౌన్‌లో తైమూర్ చర్చ కొనసాగుతోంది. చోటే నవాబ్ నయా ఫోటో వైరల్ గా మారింది. 


సైఫ్ చెల్లెలు సోహా అలీఖాన్ మనందరికి తెలుసు. అయితే, ఆయనకు మరో సోదరి కూడా ఉంది. ఆమే... సబా అలీఖాన్. తను కూడా మేనల్లుడు తైమూర్ క్యూట్ ఫోటోస్ పలుమార్లు షేర్ చేస్తుంటుంది. తాజాగా సబా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చోటే నవాబ్ రాయల్‌గా రిలాక్స్ అవుతోన్న స్టిల్‌ని నెటిజన్స్‌తో పంచుకుంది. వైట్ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించిన కరీనా వారసుడు రాజసం ఉట్టిపడే కుర్చీలో కాళ్లు చాపుకుని కూర్చుని... ఎటో చూస్తున్నాడు. ఈ ఫోటోకు ఆన్‌లైన్‌లో బోలెడు క్రేజ్ ఏర్పడింది. కొందరు తైమూర్‌లో నవాబుల రాజసం ఉట్టిపడుతోందని అంటే... మరికొందరు కపూర్ ఖాన్‌దాన్ కళ తాండవిస్తోందని కామెంట్స్ చేశారు. ఇంకా కొందరు కరీనా తాత రాజ్‌కపూర్‌ని జ్ఞాపకం చేసుకున్నారు! 


సైఫ్, కరీనా వారసులు తైమూర్ ఖాన్, జెహంగీర్ ఖాన్‌కు ఇప్పటికే బోలెడు ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి ఫోటోల్ని అటు బెబో, ఇటు సైఫ్ ఇద్దరూ షేర్ చేస్తుంటారు. వారితో పాటూ సోహా, సబా అలీఖాన్ కూడా మేనల్లుళ్ల పిక్స్ నెటిజన్స్‌తో పంచుకుంటూ ఉంటారు.   

Updated Date - 2022-03-07T01:48:21+05:30 IST