Taapsee Pannu: ఓటీటీలోకి రానున్న మిథాలిరాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’.. ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-10T15:59:57+05:30 IST

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝమ్మందినాదం’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన..

Taapsee Pannu: ఓటీటీలోకి రానున్న మిథాలిరాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’.. ఎప్పుడు.. ఎక్కడంటే..

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝమ్మందినాదం’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి తాప్సీ పన్ను(Taapsee Pannu). మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించిన ఈ బ్యూటీ.. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ సైతం మంచి పాపులారిటీనే సాధించుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్, కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తూ దూసుకెళుతోంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘శభాష్ మిథు’. భారతీయ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలిరాజ్ (Mithali Raj) బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీజీ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 15, 2022న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది.


దీంతో ఈ మూవీ నెలకూడా గడవకముందే ఓటీటీలోకి విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధమవుతోంది. ఆగస్టు 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వూట్‌(Voot)లో హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మిథాలి చిన్నప్పటి పరిస్థితుల నుంచి కెప్టెన్‌గా మహిళల క్రికెట్ జట్టును ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్‌కు నాలుగు సార్లు చేర్చడం వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను తెలుపుతుంది. ‘మెన్ ఇన్ బ్లూ’ని ఆరాధించే దేశంలో ‘వుమెన్ ఇన్ బ్లూ’గా ఎదగడానికి మిథాలీ, ఆమె జట్టు పడిన కష్టాన్ని ఈ చిత్రంలో చూపించారు.


దీనికి సంబంధించిన టీజర్‌ని వూట్ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి.. ‘ఒక పోరాట యోధురాలు, ఒక సాధకురాలు, శభాష్‌ అనే పదానికి అర్థమైన గేమ్ ఛేంజర్ అయిన మహిళా క్రికెటర్ అన్‌టోల్డ్ స్టోరీ. మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్‌గా తాప్సీ పన్నును చూడండి. Voot Selectలోకి త్వరలో రానుంది’ అని క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. అయితే ఐఎండీబీలో 10కి 7.5 పాయింట్లు సాధించిన ఈ మూవీ థియేటర్స్ అంతగా రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం ఆశిస్తోంది.



Updated Date - 2022-08-10T15:59:57+05:30 IST