రెమ్యూనరేషన్ విషయంలో సినీ ఇండస్ట్రీ పైనే నింద వేయకూడదు: Taapsee Pannu

ABN , First Publish Date - 2022-07-04T00:53:03+05:30 IST

బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి చేస్తున్న నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) . ‘పింక్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాలతో అభిమానులను మెప్పించింది.

రెమ్యూనరేషన్ విషయంలో సినీ ఇండస్ట్రీ పైనే నింద వేయకూడదు: Taapsee Pannu

బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి చేస్తున్న నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) . ‘పింక్’, ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’ వంటి సినిమాలతో అభిమానులను మెప్పించింది. తాజాగా ‘శభాష్ మిథు’ (Shabaash Mithu) చిత్రంలో నటించింది. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలోని అసమానతలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చింది.  


ప్రేక్షకుల కొత్త తరహా సినిమాలు చూడాలనుకుంటే మార్పును ఆహ్వానించాలని తాప్సీ చెప్పింది. ‘‘కథానాయికలకు పారితోషికాన్ని చెల్లించే విషయంలో సినీ ఇండస్ట్రీ పైనే నింద వేయకూడదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా ఉండవు. రివ్యూలు, మౌత్ టాక్‌ల కోసం సోమవారం వరకు అందరు ఎదురు చూస్తారు. స్టార్ హీరోల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉంటాయి. రివ్యూల కోసం ఎదురు చూడరు. వారాంతంలో కూడా కలెక్షన్స్ వస్తాయి. అందువల్ల కొత్త తరహా సినిమాలు కావాలనుకుంటే ప్రేక్షకులు కూడా మార్పును ఆహ్వానించాలి. నేను నటించిన ‘బద్లా’, ‘పింక్’ సినిమాలు కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకు నోటి ప్రచారం బాగా కలిసొచ్చింది. గతంలో హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలకు రూ. 4కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు వసూళ్లు వస్తే చాలా గొప్ప. కాలం మారుతుండటంతో ఆ చిత్రాలు కూడా రూ. 80కోట్ల నుంచి రూ.90కోట్ల వరకు కలెక్షన్స్‌ను కొల్లగొడుతున్నాయి’’ అని తాప్సీ పన్ను తెలిపింది. తాప్సీ తాజాగా మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ లో నటించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. వయకాం 18స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది.



Updated Date - 2022-07-04T00:53:03+05:30 IST