Taapsee Pannu: విమర్శకులకు చురకలంటించిన బాలీవుడ్ హీరోయిన్

ABN , First Publish Date - 2022-08-21T21:45:05+05:30 IST

‘ఝుమ్మంది నాదం’ తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ పన్ను (Taapsee Pannu). రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా

Taapsee Pannu: విమర్శకులకు చురకలంటించిన బాలీవుడ్ హీరోయిన్

‘ఝుమ్మంది నాదం’ తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ పన్ను (Taapsee Pannu). రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. తాప్సీ ఒక్కో మెట్టు ఎక్కుతూ  ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘తప్పడ్’, ‘రష్మీ రాకెట్’, ‘పింక్’ లతో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన సినిమా ‘దోబారా’ (Dobaaraa). అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. కోటి కంటె తక్కువగా వసూళ్లను రాబట్టింది. దీంతో కొంత మంది సినీ క్రిటిక్స్ ఈ మూవీని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విమర్శకులకు తాప్సీ తాజాగా చురకలంటించింది.  


ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్. ఆర్. ఖాన్ (కేఆర్‌కే) ‘దోబారా’ పై వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘దోబారా మూవీ హౌస్‌పుల్ బోర్డులతో దూసుకుపోతుుంది. సినిమా భారీగా రూ. 8లక్షల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది’’ అని కేఆర్‌కే ట్వీట్ చేశాడు. మరో సినీ క్రిటిక్ రోహిత్ జైస్వాల్ కూడా తీవ్రంగా విమర్శించాడు. ‘‘కోల్‌కతాలో ఒకరోజు హల్దీరామ్ స్వీట్స్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దోబారా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అంత కూడా లేవు’’ అని అతడు ట్వీట్ చేశాడు. అయితే వీరి వ్యాఖ్యలను ‘స్కామ్: 1992’ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehta) తప్పుపట్టాడు. తాప్సీకీ అండగా నిలిచాడు. ‘‘దోబారా మూవీ 370 స్క్రీన్స్ నుంచి రూ. 72లక్షల వసూళ్లను రాబట్టింది. ఈ వసూళ్లు సాధారణమేమీ కాదు. కానీ, సినీ విశ్లేషకులం అని చెప్పుకునే కొంతమంది సినిమాలకు నష్టం కలగజేస్తున్నారు. ఈ విమర్శకులను ఇండస్ట్రీనే పెంచి పోషించింది. ప్రస్తుతం వారు మనపై విరుచుకుపడుతున్నారు’’ అని హన్సల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు తాప్సీ స్పందించింది. ‘‘అబద్ధాన్ని ఎన్ని సార్లు గట్టిగా అరిచి చెప్పినా అది నిజం కాదు. ఇండస్ట్రీకి హానీ తలపెట్టాలకునే వారే నెగెటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. వాళ్లెంత మూర్ఖుల్లో చూడండి. దోబారాను వీరు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే’’ అని తాప్సీ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. 



Updated Date - 2022-08-21T21:45:05+05:30 IST