Kbcలో తన సీక్రెట్స్ అడిగిన అభిమానికి Taapsee Pannu రిప్లై!

ABN , First Publish Date - 2021-10-21T17:24:13+05:30 IST

`పింక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తాప్సీ పన్ను ప్రతిభ గల నటిగా గుర్తింపు దక్కించుకుంది.

Kbcలో తన సీక్రెట్స్ అడిగిన అభిమానికి Taapsee Pannu రిప్లై!

`పింక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తాప్సీ పన్ను ప్రతిభ గల నటిగా గుర్తింపు దక్కించుకుంది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న `కౌన్ బనేగా కరోడ్‌పతి-13` కార్యక్రమానికి తాజాగా హాజరైన సాహిల్ అహిర్‌వాల్ అనే వ్యక్తి హాట్ సీట్లో కూర్చోని తాప్సీ గురించి మాట్లాడాడు. `మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవర`ని సాహిల్‌ను అమితాబ్ అడగగా.. అతను తాప్సీ అని చెప్పాడు. తాప్సీ అంటే లవ్, క్రష్, సర్వస్వం అని పేర్కొన్నాడు. అంతేకాదు తాప్సీ గురించి అమితాబ్‌ను ఎన్నో ప్రశ్నలడిగాడు. 


తాప్సీ, అమితాబ్ కలిసి `పింక్`, `బాద్లా` సినిమాల్లో నటించారు. దీంతో తాప్సీ ఇష్టాఇష్టాల గురించి అమితాబ్‌ను సాహిల్ ప్రశ్నించాడు. తాప్సీకి ఇష్టమైన ఆహారం ఏంటని అడిగాడు. అయితే తాప్సీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తనకు తెలియదని అమితాబ్ చెప్పారు. తాజాగా ఆ కార్యక్రమం చూసిన తాప్సీ.. స్పందించింది. `సాహిల్.. నాకు ఛోలే బాతురే అంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడైనా కలిస్తే కచ్చితంగా ఛోలే బాతురే తిందాం. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు చేరినందుకు నీకు అభినందనలు` అని తాప్సీ ట్వీట్ చేసింది. 



Updated Date - 2021-10-21T17:24:13+05:30 IST