Swati Maliwal: నటుడి నగ్న ఫొటోలపై చర్చ జరుపుతారు.. మహిళల ఫొటోలపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు

ABN , First Publish Date - 2022-07-29T01:08:03+05:30 IST

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అందుకు కారణమేంటంటే.. ‘పేపర్’ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. శరీరం మీద నూలు

Swati Maliwal: నటుడి నగ్న ఫొటోలపై చర్చ జరుపుతారు.. మహిళల ఫొటోలపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అందుకు కారణమేంటంటే.. ‘పేపర్’ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. శరీరం మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చాడు. ఆ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కొంత మంది అతడి చర్యలను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం దుయ్యబట్టారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇప్పటికే రణ్‌వీర్‌ను వెనకెసు‌క్కొచ్చింది. బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి (Mimi Chakraborty) మాత్రం ‘‘మహిళలు ఈ విధంగా ఫొటోలను షేర్ చేస్తే మీరు అంగీకరిస్తారా’’ అని ప్రశ్నించింది. కొన్ని రోజుల క్రితమే ఓ సంస్థ రణ్‌వీర్‌పై కేసు పెట్టింది. మహిళల మనోభావాలను కించపరిచడంటూ ఆరోపించింది. తాజాగా రణ్‌వీర్ న్యూడ్ ఫొటో షూట్‌పై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) ఛైర్ పర్సన్ స్పందించింది.


ప్రతి రోజు మహిళల నగ్న ఫొటోలు సమాజంలో చక్కర్లు కొడుతున్నాయని, అటువంటి వాటికీ ఎవరు అభ్యంతరం చెప్పరని డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal) తెలిపింది. కానీ, ఒక నటుడు నగ్నంగా దర్శనమిస్తే ప్రధాన వార్తగా మారాడని ఆమె చెప్పింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘సమాజంలో ప్రతిరోజు మహిళల నగ్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పిక్స్‌పై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ, ఒక నటుడు న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులిచ్చాడు. (కారణాలేంటో అతడికే తెలుసు) ప్రస్తుతం ప్రైమ్ టైమ్ డిబేట్స్‌లో టాపిక్‌గా మారాడు. దేశంలో నిజమైన సమస్యలు మరేమీ లేవా..?’’ అని స్వాతి మలివాల్ ట్వీట్ చేసింది.  



Updated Date - 2022-07-29T01:08:03+05:30 IST