Swathimuthyam: వెనక్కి తగ్గిన నిర్మాత

ABN , First Publish Date - 2022-08-03T22:34:54+05:30 IST

గణేష్ బెల్లంకొండ (Ganesh Bellamkonda), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న

Swathimuthyam: వెనక్కి తగ్గిన నిర్మాత

గణేష్ బెల్లంకొండ (Ganesh Bellamkonda), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో..


‘‘మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు.


విడుదల తేదీని ముందుగానే ప్రకటించి, విడుదల ప్రణాళికలతో పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాము. కరోనా మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చూసి, ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము..’’ అని పేర్కొన్నారు. కాగా, PDV Prasad సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కె కృష్ణ (Lakshman K Krishna) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించారు. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రగతి, సురేఖావాణి తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. (Swathimuthyam postponed) 





Updated Date - 2022-08-03T22:34:54+05:30 IST