Swathi Muthyam: రిలీజ్ డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2022-08-10T17:30:45+05:30 IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) రెండవ కొడుకు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'స్వాతిముత్యం' (Swathi Muthyam). ఈ మూవీకి సంబంధించిన

Swathi Muthyam: రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) రెండవ కొడుకు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'స్వాతిముత్యం' (Swathi Muthyam). ఈ మూవీకి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాతో లక్ష్మణ్ కె కృష్ణ (Lakshman K Krishna) దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, స్పెషల్ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే, 'స్వాతిముత్యం' చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


కానీ, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు దసరా సెలవులను క్యాష్ చేసుకోడానికి..విజయ దశమి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా 'స్వాతిముత్యం' కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేశారు. 2022, అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన ఓ బ్యూటీఫుల్ పోస్టర్ ను కూడా వదిలారు.


కాగా, పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అయితే, అదే సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్', నాగార్జున నటిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సీనియర్ స్టార్ హీరోలతో పోటీకి దిగుతున్న గణేష్ ఏ మేరకు తట్టుకొని నిలబడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు వీకే నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సునయన, దివ్య శ్రీపాద తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. 

Updated Date - 2022-08-10T17:30:45+05:30 IST