Swara Bhasker: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని కొందరూ వ్యక్తిగతంగా తీసుకున్నారు.. బాయ్‌కాట్‌పై స్పందించిన బాలీవుడ్ నటి

ABN , First Publish Date - 2022-09-01T16:41:39+05:30 IST

బాయ్‌కాట్ (Boycott).. ఈ పదం గురించే బాలీవుడ్ (Bollywood) జనాలు ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..

Swara Bhasker: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని కొందరూ వ్యక్తిగతంగా తీసుకున్నారు.. బాయ్‌కాట్‌పై స్పందించిన బాలీవుడ్ నటి

బాయ్‌కాట్ (Boycott).. ఈ పదం గురించే బాలీవుడ్ (Bollywood) జనాలు ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీని బారిన పడి అక్కడి స్టార్ హీరోల సినిమాలే విలవిలలాడిపోయాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమీర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ గురించి. చాలా ఏళ్ల క్రితం భారతదేశంలో అసహనం అంటూ ఆమీర్ చేసిన వ్యాఖ్యల కారణంగా.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ ట్రెండ్ అయ్యింది. దాని ఫలితంగా విడుదల తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకని బడ్జెట్‌లో సగం కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు స్పందించారు. తాజాగా మరో బాలీవుడ్ తార స్వరా భాస్కర్ (Swara Bhasker) సైతం ఈ పరిణామం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.


స్వరా మాట్లాడుతూ.. ‘నిజానికి బాయ్‌కాట్ ట్రెండ్ సినిమా వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నాకు తెలియదు. అయితే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య తర్వాత ఆలియా భట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతికూలత వచ్చింది. అది చాలా అన్యాయం. అలాంటి ఆరోపణలు అన్ని బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న నటీనటులపైనే చేస్తుంటారు. దాంతో ఆలియాపై భాయ్‌కాట్ ట్రెండ్ మొదలైంది. సరిగ్గా అదే సమయంలో సడక్ 2 విడుదల కావడంతో.. ఆ సినిమాకి నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. అది సినిమా ఫలితంపై ఘోరంగా ప్రభావం చూపింది’ అని చెప్పుకొచ్చింది.


స్వరా ఇంకా మాట్లాడుతూ.. ‘సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంతో ఆలియా నటించిన మరో చిత్రం ‘గంగుభాయ్ కతియావాడి’ సమయంలోనూ ఇలాంటి ధోరణి కనపడింది. అయితే అది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. బంధుప్రీతి, సుశాంత్ ఆత్మహత్య గురించి బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ అయ్యింది. కానీ ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాని చూసి ఇష్టపడ్డారు’ అని చెప్పుకొచ్చింది.


అలాగే.. ‘ఇది ఒక ఎజెండాతో నడిచే ఒక చిన్న సమూహం. వారు ద్వేషపూరిత వ్యక్తులు. వారు బాలీవుడ్‌ అంటే కోపం.. వారు బాలీవుడ్‌ను నాశనం చేయాలనుకుంటున్నారు. అందరూ బాలీవుడ్ గురించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. దాని వల్ల వారి ఆదాయం వస్తుందని నేను భావిస్తున్నాను. సుశాంత్ ఆత్మహత్యని వ్యక్తిగత ఎజెండాలు, ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు’ అని స్వరా తెలిపింది. కాగా..  స్వర ప్రస్తుతం మెహర్ విజ్, పూజా చోప్రా, శిఖా తల్సానియాతో కలిసి ‘జహాన్ చార్ యార్‌’లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నారు.

Updated Date - 2022-09-01T16:41:39+05:30 IST