Hijab Controversy: ద్రౌపది వస్ర్తాపహరణంతో పోల్చిన నటి.. కోపంతో ఊగిపోతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-02-16T21:32:00+05:30 IST

కర్ణాటకలో విద్యాసంస్థల్లో గొడవలకు హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ప్రస్తుతం అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది...

Hijab Controversy: ద్రౌపది వస్ర్తాపహరణంతో పోల్చిన నటి.. కోపంతో ఊగిపోతున్న నెటిజన్లు

కర్ణాటకలో విద్యాసంస్థల్లో గొడవలకు హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ప్రస్తుతం అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ కాంట్రవర్సీపై స్పందించిన ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా నటి స్వర భాస్కర్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించింది.


స్వర చేసి ట్వీట్‌లో.. ‘మహాభారతంలో ద్రౌపదికి బలవంతంగా వస్ర్తాపహరణం గురించి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది గొప్పవారు, బలవంతులు, ఆపగలిగిన వారు సైతం చూస్తుండిపోయారు. అది మళ్లీ ఇప్పుడు గుర్తొంచింది’ అంటూ రాసుకొచ్చింది. చాలామంది నెటిజన్లకు ఈ పోస్ట్ నచ్చలేదు. దీంతో స్వర భాస్కర్‌ని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.




మహాభారతం గురించి మాట్లాడే ముందు ఆ పవిత్ర గ్రంథం గురించి తెలుసుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వింటుంటే నవ్వొస్తోందంటూ కోపంగా విమర్శలు చేశారు.













Updated Date - 2022-02-16T21:32:00+05:30 IST