Swara Bhasker: డబ్బులు తీసుకున్నావా అంటూ.. బాలీవుడ్ బ్యూటీని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Twitter IconWatsapp IconFacebook Icon
Swara Bhasker: డబ్బులు తీసుకున్నావా అంటూ.. బాలీవుడ్ బ్యూటీని ఆడేసుకుంటున్న నెటిజన్లు

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినీ జనాలు ఎంతో ఎగ్జాయిటింగ్‌గా ఎదురుచూసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. ఆమీర్ ఖాన్ (Aamir Khan), కరీనాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకి ముందు మంచి బజ్‌ క్రియేట్ చేసింది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్‌’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే.. విడుదల తర్వాత ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీపై స్పందిస్తూ చాలా బావుంది చూడండి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా నటి స్వర భాస్కర్ (Swara Bhasker) కూడా ఈ మూవీపై స్పందించింది.


స్వర ట్విట్టర్‌లో చేసిన పోస్టులో.. ‘లాల్‌సింగ్ చడ్డా చూస్తున్నాను! ఇప్పటికే గుండెలని మేలిపెడుతోంది. అమీర్‌ఖాన్ అందమైన సిక్కుగా మారాడు. అలాగే.. లిటిల్ లాల్, లిటిల్ రూపా చాలా క్యూట్‌గా ఉన్నారు. మోనాసింగ్ హృదయాలను కొల్లగొడుతున్నారు. యాక్టింగ్‌ సూపర్’ అంటూ రాసుకొచ్చింది.


సినిమా పూర్తైన తర్వాత స్వర మరో పోస్టు పెట్టింది. అందులో.. ‘లాల్‌సింగ్ చడ్డా చాలా అందమైన చిత్రం. మన జీవితాలను ప్రతిబింబిస్తోంది. అతుల్ కులకర్ణి సర్ ఫారెస్ట్ గంప్‌ని చాలా బాగా రీమేక్ చేశాడు. మలేరియా కొన్నిసార్లు మతం ద్వారా వ్యాపిస్తుంది అనే డైలాగ్ చాలా బావుంది. అందరూ చాలా బాగా నటించారు. కచ్చితంగా చూడాల్సిన చిత్రం’ అని రాసుకొచ్చింది.


ఈ పోస్టుల ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ఈ పోస్టులపై స్పందిస్తూ స్వరని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే.. డబ్బులు తీసుకుని ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నావా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరేమో.. ‘ఆమె 2 ట్వీట్లు చేసిన తర్వాత కూడా ఆమెకు డబ్బు చెల్లించకపోవడం బాధాకరం. ఎందుకంటే బాలీవుడ్ సి గ్రేడ్ నటుల గురించి పెద్దగా పట్టించుకోదు’ ఒక నెటిజన్ వెటకారంగా రాసుకొచ్చాడు. ఇంకొకరేమో.. ‘ఒకటి చేదు, మరొకటి వేప.

అమీర్ సినిమా, స్వర ప్రమోషన్ ఇంత జరిగినా దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ కామెంట్ చేశారు.









AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.