Swapna dutt: డాటర్‌ స్ట్రోక్‌ అని విమర్శించారు!

ABN , First Publish Date - 2022-08-15T01:09:37+05:30 IST

‘‘టెలివిజన్‌లో నేను విఫలమైనప్పుడు చాలామంది అశ్వినీదత్‌కు ‘డాటర్‌ స్ర్టోక్‌’ అని విమర్శించారు. అప్పుడు బాధ అనిపించినా ధైర్యంగా నిలబడ్డాం. ఇప్పుడు నిర్మాతగా మా సక్సెస్‌ చూసి అప్పుడు విమర్శించిన వారే ‘అమ్మాయిలు అయినా ‘వైజయంతి’ పేరు నిలబెడుతున్నారు’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప ప్రశంసం ఏముంటుంది’’ అని స్వప్నాదత్‌ అన్నారు.

Swapna dutt: డాటర్‌ స్ట్రోక్‌ అని విమర్శించారు!

‘‘టెలివిజన్‌లో నేను విఫలమైనప్పుడు చాలామంది అశ్వినీదత్‌కు ‘డాటర్‌ స్ర్టోక్‌’ (Daughter storke)అని విమర్శించారు. అప్పుడు బాధ అనిపించినా ధైర్యంగా నిలబడ్డాం. ఇప్పుడు నిర్మాతగా మా సక్సెస్‌ చూసి అప్పుడు విమర్శించిన వారే ‘అమ్మాయిలు అయినా ‘వైజయంతి’ పేరు నిలబెడుతున్నారు’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప ప్రశంసం ఏముంటుంది’’ అని స్వప్నాదత్‌ (Swapna dutt)అన్నారు. 2006లో గతంలో ఆమె టీవీ రంగంలో పని చేశారు. అక్కడ ఫెయిల్‌ అవ్వడం గురించి చెప్పుకొచ్చారు స్వప్న. 


‘‘ఏ రంగంలో అడుగుపెట్టినా నేను సక్సెస్‌ అవ్వగలను అని చెప్పలేను. జీ తెలుగు, ఈ టీవీకి ఫస్ట్‌ ‘సరిగమప’ ప్రోగ్రాం చేసింది నేనే. మా టీవీకి కూడా మేజర్‌ ప్రోగ్రాంలు చేశాను. 2006లోనే నెలకు లక్షన్నర దాకా సంపాదించేదాన్ని. స్వతహాగా మేం నిర్మాతలం. కానీ బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది వేరు. దోశ బాగా వేస్తామని దోశ పిండి వ్యాపారం చేసినట్లు అయింది మా పని. అలాంటి ఎదురుదెబ్బతో ఏం చేయాలో తోచలేదు. మూడొందల మంది ఉద్యోగులు నన్ను నమ్ముకొని ఉన్నారు. చాలా ప్రయత్నం చేశాక మోయలేక వదిలేశాం. మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన నాన్న స్నేహితులు కొంత మంది నష్టపోయారు. అది చాలా నిరాశ కలిగించినా విలువైన పాఠాలు నేర్చుకున్నాం. లోకల్‌ టీవీ ఐడియా ఫెయిల్‌ అయినా అందులో మేం ప్రసారం చేసిన కంటెంట్‌ను పెద్ద ఛానళ్లు భారీ మొత్తానికి కొన్నారు. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ కదా’’ అని అన్నారు. 




Updated Date - 2022-08-15T01:09:37+05:30 IST