సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

కొత్త జంటతో ధార్వీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

కొత్త జంటతో ధార్వీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. విజయదశమి రోజున జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్రనిర్మాత బాలబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఉత్తేజ్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, ప్రొఫెసర్‌ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వూర శ్రీను దర్శకత్వంలో లెక్కల మహేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: బాపరాజు ఆంజనేయులు, పాటలు : కళారత్న బిక్కి కృష్ణ, ఎస్‌.జయసాగర్‌.

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST