Sushmita-Lalit Modi డేటింగ్ బంధంపై ఆమె మాజీ boyfriend ఏం చెప్పాడంటే...

ABN , First Publish Date - 2022-07-16T13:32:12+05:30 IST

మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌ లలిత్ మోదీల డేటింగ్ బంధంపై ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ స్పందించాడు....

Sushmita-Lalit Modi డేటింగ్ బంధంపై ఆమె మాజీ boyfriend ఏం చెప్పాడంటే...

ముంబయి: మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌ లలిత్ మోదీల డేటింగ్ బంధంపై ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ స్పందించాడు.బాలీవుడ్ కొత్త జంట సుస్మితా సేన్, లలిత్ మోదీలిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం చాలా మందికి షాకింగ్ న్యూస్‌గా మారింది. ఈ వార్తలపై అభిమానుల స్పందనతో సోషల్ మీడియా నిండిపోయింది. ఇప్పుడు సుస్మితాసేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ ఈ కొత్త రిలేషన్‌షిప్‌పై  స్పందించాడు.సుస్మిత లలిత్ మోదీతో డేటింగ్ చేయడంపై స్పందించిన రోహ్మాన్ షాల్ జులై14న సుస్మితా సేన్‌తో లలిత్ మోదీ పంచుకున్న చిత్రాలను చూసి సోషల్ మీడియాలో ‘‘కొత్త ప్రారంభం’’ అని ప్రకటించారు. 


మాజీ ప్రియుడి కామెంట్ చాలా మందికి షాకింగ్‌గా మారింది.ఈ డేటింగ్ వ్యవహారంపై సుస్మిత సోదరుడు రాజీవ్ సేన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. కాని సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ మాత్రం ఈ కొత్త జంట కోసం రిలేషన్‌షిప్‌పై సంతోషంగా ఉన్నాడు.


రోహ్మాన్ షాల్, సుస్మితాసేన్ గత ఏడాది డిసెంబరులో విడిపోయారు.‘‘వాళ్ల కోసం మనం సంతోషంగా ఉందాం. ప్రేమ చాలా అందంగా ఉంటుంది. నాకు తెలిసినదల్లా ఆమె(సుస్మిత) ఎవరినైనా ఎంచుకుంటే, అతను తగినవాడే!’’అని సుస్మిత డేటింగ్ వ్యవహారంపై రోహ్మాన్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-16T13:32:12+05:30 IST