Sushmita Sen: మాజీ ప్రియుడితో షాపింగ్‌కి వెళ్లిన సుస్మిత.. మరి లలిత్ మోదీ సంగతేంటంటూ..

ABN , First Publish Date - 2022-08-29T17:03:15+05:30 IST

ఇటీవలే బాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుస్మితా సేన్(Sushmita Sen). తనకంటే వయస్సులో..

Sushmita Sen: మాజీ ప్రియుడితో షాపింగ్‌కి వెళ్లిన సుస్మిత.. మరి లలిత్ మోదీ సంగతేంటంటూ..

ఇటీవలే బాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుస్మితా సేన్(Sushmita Sen). తనకంటే వయస్సులో పదేళ్ల చిన్నవాడితో ప్రేమాయణం నడిపించడం.. అనంతరం విడిపోవడంతో వార్తల్లో నిలిచింది. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మళ్లీ లవ్‌లో పడడంతో సుస్మితా పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఈ తరుణంలో మరోసారి మాజీ ప్రియుడి రోహమాన్ షాల్‌(Rohman Shawl)తో కలిసి షాపింగ్‌కి వెళ్లి మళ్లీ వార్తల్లోకి వచ్చింది.


రోహమాన్, సుస్మితా మధ్య కొన్నేళ్లపాటు ఎఫైర్ నడిచింది. అంతేకాకుండా.. ఆమె దత్తత కూతుర్లతో సైతం రోహమాన్ చాలా సన్నిహితంగా ఉండేవాడు. అయితే.. వీరిద్దరూ విడిపోయిన తర్వాత నెలరోజులు గడవకముందే లలిత్ మోదీతో లవ్‌లో పడింది. అయినప్పటికీ ఈ మాజీ లవర్స్‌ మధ్యలో స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. అయితే.. లలిత్‌తో లవ్‌లో పడిన తర్వాత మొదటిసారి రోహమాన్‌తో కలిసి బయట మీడియా కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సుస్మితా కూతురు రేనీ కూడా ఉంది. మీడియా అడగడంతో వారు ముగ్గురు కలిసి ఫొటోలకి స్టిల్స్ ఇచ్చారు.


అయితే.. ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది చూస్తే లలిత్ మోదీ బాధపడతాడేమో’, ‘రోహమాన్ ఇక్కడ ఉంటే అక్కడ లలిత్ సంగతేంటి మరి’, ‘రోహమాన్‌ని చూస్తే బాధగా ఉంది’ అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-08-29T17:03:15+05:30 IST