నా కూతుళ్లు కారణం కాదంటూనే.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు గతంలో Sushmita Sen ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-07-15T21:41:28+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సుస్మితా సేన్ (Sushmita Sen). ఈ మాజీ మిస్ యూనివర్స్, తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ షాల్‌తో గతంలో డేటింగ్ చేసింది.

నా కూతుళ్లు కారణం కాదంటూనే.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు గతంలో Sushmita Sen ఏం చెప్పిందంటే..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సుస్మితా సేన్ (Sushmita Sen). ఈ మాజీ మిస్ యూనివర్స్, తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ షాల్‌తో గతంలో డేటింగ్ చేసింది. అనంతరం అతడికి బ్రేకప్ చెప్పింది. తాజాగా సుస్మితా సేన్ ఐపీఎల్ మాజీ చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi)తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని లలిత్ మోదీనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపాడు. సుస్మితతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను షేర్ చేశాడు.


సుస్మితా సేన్ గతంలో ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) చాట్ షోలో పాల్గొంది. వివాహం ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకోకపోవడానికి తన కూతుళ్లు రెన్నే, అలీసా కారణం కాదని చెప్పింది. ‘‘రిన్నేను నేను దత్తత తీసుకన్న తర్వాత నా జీవితంలోకి ఎవరు రాలేదు. వారికీ నా ప్రాధాన్యతలేమిటో తెలియదు. నా కూతుళ్ల బాధ్యతను పంచుకోవాలని నేను ఆశించను. మీరు ఎట్టి పరిస్థితుల్లోను వారికి దూరంగా ఉండమని చెప్పలేరు. నా కూతుళ్లకు కొంచెం వయసు వచ్చే వరకు నేను అవసరం. అదృష్టమేమిటంటే, నా జీవితంలో ఓ ఆసక్తికరమైన వ్యక్తిని కలిశాను. కానీ, వివాహం ఎందుకు చేసుకోలేదంటే నా కూతుళ్లకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను పెళ్లి చేసుకోకపోవడానికి వారు ఏ మాత్రం కారణం కాదు. నేను మూడు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చాను. దేవుడు మాత్రమే ఆ బంధం నుంచి నన్ను కాపాడాడు’’ అని సుస్మితా సేన్  చెప్పుకొచ్చింది. 



Updated Date - 2022-07-15T21:41:28+05:30 IST